David Warner says Before My Test Retirement Australia will beat India in India: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నా.. అతను ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడిగా ఉన్నాడు. 35 ఏళ్ల వయసున్న వార్నర్‌.. రిటైర్మెంట్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో కూడా ఆసీస్ ఓపెనర్ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడం మాత్రం మానుకోవడం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు (Retirement) పలికే లోపు టీమిండియా (India)ను సొంతగడ్డపై ఓడించాలని ఉందన్నాడు. 2023లో ఇంగ్లండ్‌లో జరుగనున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC)లోనూ ఆసీస్‌ను విజేతగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం డేవిడ్ వార్నర్ యాషెస్ 2021-22 ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. మూడింటిని గెలిచి యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. బాక్సింగ్ డే టెస్టులో వార్నర్ 38 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 95, 38.. మొదటి టెస్టులో 94 పరుగులు చేశాడు. రెండుసార్లు సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్‌ 15 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం వార్నర్ ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోలో మాట్లాడుతూ పలు అంశాలపై స్పందించాడు. 


Also Read: LPG Cylinder Price: సామాన్య ప్రజలకు భారీ షాక్.. జనవరి 1న గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం!!


'మేం భారత జట్టుని సొంత గడ్డపై ఇప్పటి వరకు ఓడించలేకపోయాం. ఇది ఇప్పటికే జరిగితే బాగుంటుంది. నేను క్రికెట్‌కు వీడ్కోలు పలికే లోపు టీమిండియాను సొంత గడ్డపై (India in India) ఓడించాలని ఉంది. ఇంగ్లండ్‌లో కూడా మేము యాషెస్ సిరీస్ సాధించలేకపోయాం. 2019లో జరిగిన టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించాం. భారత్, ఇంగ్లండ్ దేశాల్లో మరోసారి ఆడే అవకాశం వస్తే.. చరిత్ర సృష్టించాలని ఉంది' అని డేవిడ్ వార్నర్ చెప్పాడు. సొంత గడ్డపై మెరుగ్గా రాణించే వార్నర్‌కి.. భారత్‌పై మాత్రం పేలవ రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌లో ఆడిన 8 టెస్టు మ్యాచుల్లో.. 24 సగటుతో 388 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సెంచరీ కూడా చేయలేదు.


'ప్రస్తుతం నేను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాను. మొదటి రెండు టెస్టుల్లో బాగా ఆడానని నాకు అనిపిస్తోంది. కెరీర్‌ను మరో విధంగా ఆడినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇంగ్లండ్ బౌలర్ల లైన్ మరియు లెంగ్త్‌లను గౌరవించవలసి వచ్చింది. అందుకే సెంచరీ చేయలేకపోయా. వచ్చే ఏడాది కూడా ఈ ఫామ్ కొనసాగించాలనుకుంటున్నాను. వయసు మీద పడుతున్న ఆటగాళ్లందరూ జేమ్స్ అండర్సన్‌ (James Anderson)ని ఆదర్శంగా తీసుకోవాలి. జిమ్మీ ఓ బెంచ్‌ మార్క్‌ని సెట్ చేశాడు. జట్టు కోసం మెరుగ్గా రాణిస్తున్నంత కాలం ఆడుతూనే ఉంటాను. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే' అని డేవిడ్ వార్నర్‌ చెప్పుకొచ్చాడు.


Also Read: COVID 19 Vaccine: కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కిన 40 ఏళ్ల వ్యక్తి.. కారణం ఏంటో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి