Glenn Maxwell Smashes Fastest Century: ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. బుధవారం న్యూఢిల్లీలో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇటీవల మార్క్‌క్రమ్ 49 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. మాక్స్‌వెల్‌తోపాటు డేవిడ్ వార్నర్ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వార్నర్‌కు ఇది వరుసగా ఇది రెండో సెంచరీ కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. ఆరంభంలోనే మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయింది. అనంతరం డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ నెదర్లాండ్స్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వార్నర్ 93 బంతుల్లో 104 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ కూడా 68 బంతుల్లో 71 పరుగులు చేశాడు. మార్నస్ లబూషేన్ 47 బంతుల్లో 62 పరుగులతో రాణించారు. 39.1 ఓవర్లలో ఆరో వికెట్‌గా బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్.. 48.5 ఓవర్లలోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంటే కేవలం 10 ఓవర్లలోపే మాక్స్‌వెల్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 240.91గా ఉంది. అంతకుముందు 2015 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ 51 బంతుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే.


మ్యాక్స్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వన్డే చరిత్రలో చెత్త రికార్డు నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డి లీడే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా బాస్ డి లీడే నిలిచాడు. వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై ఈ నెదర్లాండ్స్ బౌలర్ ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా బౌలర్ మైఖేల్ లెవెల్లిన్ (113)పై ఈ చెత్త రికార్డు ఉండేది. ఇప్పుడు బాస్ డి లేడే చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. 


ఫాస్టెస్ట్ సెంచరీలు ఇలా..


==> గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 40 బంతులు vs నెదర్లాండ్స్, 2023 
==> ఐడెన్ మార్‌క్రమ్‌ (సౌతాఫ్రికా)- 49 బంతులు vs శ్రీలంక 2023
==> కెవిన్ ఓ'బ్రియన్ (ఐర్లాండ్)- 50 బంతులు vs ఇంగ్లాండ్, 2011
==> గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 51 బంతులు vs శ్రీలంక 2015.


Also Read: Benefits Of Eating Ghee: నెయ్యి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు.. మీకు తెలియని విషయాలు ఇవే..! 


Also Read: Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook