WTC 2023-25 Points Table Update: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. సిడ్నీలో పాకిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. టీమిండియాను వెనక్కి నెట్టి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-0తో దక్కించుకోవడం ద్వారా కంగారు టీమ్ తొలి స్థానానికి ఎగబాకగా.. రోహిత్ సేన రెండో స్థానానికి పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2023-25 రేసులో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. ఐదు గెలిచి, రెండింటిలో ఓడి.. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. దీంతో 56.25 విన్‌ పర్సంటేజ్‌తో ఫస్ట్ ఫ్లేస్ లో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడిన టీమిండియా రెండు గెలిచి, ఒక దాంట్లో ఓడి.. ఒకటి డ్రా చేసుకుంది. దీంతో భారత్ 54.16 విన్‌ పర్సంటేజ్‌ పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. రెండు టెస్టులు ఆడిన సాతాఫ్రికా, న్యూజిలాండ్ ఒక్కో విజయంతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, శ్రీలంకలు నిలిచారు. టీమిండియాను ఆసీస్ అధిగమించినా ఫిబ్రవరి-మార్చిలో తిరిగి అగ్రస్థానం కైవసం చేసుకునే అవకాశం ఉంది. రాబోయే రెండు నెలల్లో భారత్‌ కీలక సిరీస్ ల ఆడనుంది. ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ లో గెలిస్తే భారత్ తిరిగి నంబర్ వన్ పొజిషన్ కు వచ్చే అవకాశం ఉంది. 


Also Read: Ind W vs Aus W 01st T20I: కంగారూ జట్టును కంగారెత్తించిన సాధు.. తొలి టీ20లో భారత అమ్మాయిలు ఘన విజయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి