Glenn Maxwell soon become India's son in law: ఆస్ట్రేలియా (Australia) క్రికెటర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారత అల్లుడు కాబోతున్నాడు. భారత సంతతికి చెందిన తన గర్ల్‌ఫ్రెండ్‌ వినీ రామన్‌తో గతేడాది మాక్స్‌వెల్ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజాగా వినీ రామన్ వెల్లడించారు. ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు వెల్లడించనప్పటికీ... త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నట్లు స్పష్టం చేసింది. మాక్స్‌వెల్-వినీ రామన్ చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది మార్చిలో మాక్స్‌వెల్-వినీ రామన్‌లు (Glenn Maxwell-Vini Raman) కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో భారతీయ సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట నిశ్చితార్థం ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాక్స్‌వెల్ 2019లో మానసిక ఆరోగ్య సమస్యలతో క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో గర్ల్‌ఫ్రెండ్ వినీ రామన్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు అండగా నిలిచారు.


ఇక క్రికెట్ విషయానికి వస్తే... ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ (BBL) టీ20లో ఆడుతున్న మాక్స్‌వెల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండు రోజుల క్రితం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ టీమ్ తరుపున సెంచరీ బాదేశాడు. బీబీఎల్‌లో మాక్స్‌వెల్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. కేవలం 57 బంతుల్లోనే మూడు సిక్సర్లు, 12 ఫోర్లతో మాక్స్‌వెల్ సెంచరీ నమోదు చేశాడు. అయినప్పటికీ మెల్‌బోర్న్ టీమ్‌కు (Cricket Australia) ఓటమి తప్పకపోవడం గమనార్హం. సిడ్నీ సిక్సర్స్‌ నిర్దేశించిన 177 టార్గెట్‌ను మెల్‌బోర్న్ స్టార్స్ టీమ్ సునాయాసంగా చేధించింది. మెల్‌బోర్న్ టీమ్‌లో జోష్ ఫిలిప్ కేవలం 61 బంతుల్లోనే 99 పరుగులు చేసి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు. 



Also Read: Video: సింహాన్నే చిత్తు చేసిన దున్న-కింగ్ ఆఫ్ జంగిల్‌‌కు చావుదెబ్బ రుచి చూపించిందిగా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook