Australian judge reinstates tennis star Djokovic’s visa: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్​కు మెల్​బోర్న్ కోర్టులో (Melbourne Court) ఊరట లభించింది.  వీసాను పునరుద్ధరించాలని కోర్టు తీర్పు వెలువరించింది. జకోవిచ్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని (Australian government) ఆదేశించారు. కరోనా నింబంధనల ఉల్లంఘన కారణంగా ఆస్ట్రేలియా, జకోవిచ్ వీసా రద్దు (Djokovic’s visa Canceled) చేసిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌'లో పాల్గొనేందుకు జకోవిచ్ (Novak Djokovic) నాలుగు రోజుల క్రితం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అతడిని అడ్డుకున్నారు. జకోవిచ్‌ వీసాను రద్దు చేసి డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచారు. 20 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్న ఆటగాడి పట్ల ఆస్ట్రేలియా ఇలా ప్రవర్తించడంపై ప్రపంచ వ్యప్తంగానూ పలు విమర్శలు వచ్చాయి. 


Also Read: Novak Djokovic Visa Cancelled: టెన్నిస్ స్టార్ కు ఆస్ట్రేలియా షాక్.. జకోవిచ్‌ వీసా రద్దు!


ఈ ఘటన సెర్బియా ప్రభుత్వం (Serbia Govt) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జొకోవిచ్ న్యాయవాదులు అతనిని ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్. సోమవారం దీనిపై తీర్పు వెలువరించింది ఫెడరల్ కోర్టు. వీసా రద్దు నిర్ణయం అన్యాయమన్న న్యాయమూర్తి కెల్లీ.. జకోవిచ్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ కేసులో తిరిగి అప్పీల్ చేస్తామని ఆస్ట్రేలియా మంత్రి తెలిపారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook