సిడ్నీవేదికగా జరుగుతున్న నాల్గో టెస్టు మూడో రోజు ఆటలో కోహ్లీ సేన పై చేయి సాధించింది. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాలనుకొన్న ఆసీస్ ఆశలపై టీమిండియా బౌలర్లు నీళ్లు చల్లారు. స్వల్ప స్కోరుకే ఆసీస్ ను కట్టడి చేశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి  236 చేసిన ప్రధాన బ్యాట్స్ మెన్లలంతా పెలివియన్ బాటపట్టారు. దీంతో ఆసీస్ జట్టు ఇబ్బందుల్లో పడింది. మ్యాచ్ జరిగిన తీరు గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓపెనర్లు ఔటైయ్యారు ఇలా..


24 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. దూకుడు మీదున్న ఆడుతున్న  ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (27) కుల్‌దీప్‌ స్పిన్ మాయజాలంలో చిక్కుకొని పెవిలియన్‌ దారిపట్టాడు. ఇలా ప్రారంభమైన ఆసీస్ పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. కాగా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా ఔటైన  తర్వాత క్రీజులో వచ్చిన ఆసీస్ బ్యాట్స్ మెన్లు నిలదొక్కుకునే క్రమంలో ఎక్కవ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లంచ్‌ విరామం వరకు వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. ఆ తర్వాత ఆసీస్‌ దూకుడుకు జడేజా కళ్లెం వేశాడు. ఆరంభం నుంచి క్రీజులో పాతుకు ప్రమాదకరంగా పరిగణిస్తన్న మార్కస్‌ హారిస్‌(79)ను జడేజా పెలివిలియన్ కు పంపాడు


టాప్ ఆర్డర్ పతనం...
అలా మొదలైన ఆసీస్ పతనం క్రమం తప్పుకుండా కొనసాగింది. ఈ తర్వాత వచ్చిన సీనియర్ బ్యాట్స్ మెన్ షాన్‌ మార్ష్‌ (8)  జడేజా వేసిన బంతిని భారీ షాట్ కొట్టి రహానే చేతికి క్యాచ్ ఇచ్చాడు. అత్యంత ప్రమాదకర  మార్ష్‌ పెవిలియన్‌ బాట పట్టడంతో ఆసీస్‌ మీద మరింత ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో కాసేపటికే లబుషేన్‌(38) కూడా ఔటయ్యాడు. మార్నస్ లాబుచాగ్నే కు ఫేసర్ షమీ ముందు తలవంచి తన వికెట్ అర్పించుకున్నాడు. ఈ వికెట్ పడటంతో ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ కుదేలైంది.


కుప్పకూలిన మిడిల్ ఆర్డర్


టాప్ ఆర్ట్ కు కుప్పకూల్చడంలో జడేజా కీలక పాత్ర పోషించగా మిడిల్ ఆర్డర్ ను కుల్‌దీప్‌ కోలుకోకుండా చేశారు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా వికెట్ పడగొట్టిన కుల్దిప్ మిడిల్ ఆర్డర్ కూల్చడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌పైన్‌ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. నిలకడగా ఆడినట్లు కనిపించిన ట్రావిస్ హెడ్‌(20)ను కుల్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. అప్పటికి ఆసీస్‌ స్కోర్ 192 పరుగులగా ఉంది. వచ్చి రావడంతోనే బౌండరీ బాదిన ఆసీస్ సారథిను కుల్‌దీపే బోల్తా కొట్టించాడు. కుల్‌దీప్‌ వేసిన బంతికి టిమ్‌పైన్‌ (5) బౌల్డ్ అయి పెలివిలయన్ బాట పట్టాడు. ఇలా ఆసీస్ మిడిలార్డర్‌ కుల్దీప్ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ క్రమంలో కుల్దీప్ మూడు వికెట్లు తీశాడు. జట్టులో తీవ్ర పోటీ ఎదుర్కొని ఎట్టకేలకు తుది జట్టులో స్థానం దక్కించుకున్న కుల్‌దీప్‌.. ఆసీస్‌పై విరుచుకుపడటం గమనార్హం.


మ్యాచ్ కు వర్షం అడ్డంకి...
మూడో రోజు ఆటకు కాసేపు వర్షం అడ్డంకి కాగా నిలిచింది. మూడో రోజు ఆట చివర్లో కాసేపు వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను కొంతసేపటివరకు నిలిపి వేశారు. తర్వాత భారీ వర్షం కురవడంతో మూడో రోజు మ్యాచ్‌ను 84 ఓవర్లకే ముగించారు. 


మ్యాచ్ హైలెట్స్: 
*  ఆరు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు
* భారత్ స్పిన్ దెబ్బకు చేతులెత్తేసిన ఆసీస్ ప్రధాన బ్యాట్స్ మెన్స్
* ఆరు వికెట్లలో ఐదు స్పిన్నర్లకే ( కుల్దీప్ 3,జడేజా 2) దక్కడం గమనార్హం
* మూడో రోజు మ్యాచ్ కు వర్షం అడ్డంకి
*  భారీ వర్షంతో మూడో రోజు మ్యాచ్‌ను 84 ఓవర్లకు కుదిపంపు
* 386 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
* ఆసీస్ కు ఫాలోఅన్ గండం
* మూడో రోజూ కోహ్లీ సేనదే పైచేయి..