Shane Warne fear of Sachin: షేన్ వార్న్. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. షేన్ వార్న్ స్పిన్ అంటేనే బ్యాట్స్‌మెన్లకు భయం. అటువంటిది షేన్ వార్న్‌కు మాస్టర్ బ్లాస్టర్ అంటే భయమట. ఆ వివరాలు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైన రోజు ఇవాళ. ప్రపంచ మేటి స్పిన్నర్, మాజీ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. క్రికెట్ ప్రేమికుల్ని కోలుకోలేని షాక్ ఇది. కేవలం 52 ఏళ్ల వయస్సులోనే ఇక సెలవంటూ నిష్క్రమించాడు. క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్న ఘనత షేన్ వార్న్‌దే. ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న ఐపీఎల్ సీజన్ ప్రారంభంలోనే టైటిల్ గెల్చుకున్న జట్టుకు కెప్టెన్ కూడా షేన్ వార్న్ కావడం విశేషం.


1992లో టీమ్ ఇండియా మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన షేన్ వార్న్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు సాధించిన షేన్ వార్న్ మొత్తం క్రికెట్ కెరీర్‌లో వేయి వికెట్లు పడగొట్టిన రెండవ క్రికెటర్‌గా ఉన్నాడు. మొదటి స్థానంలో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టడంలో షేన్ వార్న్ తరువాతే ఎవరైనా. ఎందుకంటే షేన్ వార్న్ స్పిన్‌ను ఎదుర్కోవడమంటే మాటలు కాదు. నిజంగా ఓ అద్భుతమైన స్పెల్ అతనిది. బౌల్ చేతి నుంచి జారిన తరువాత..ఎటు నుంచి ఎలా తిరుగుతుందో కాస్సేపు అర్ధం కాదు. అర్ధమయ్యేలోగా వికెట్ ఎగురేసుకుని పోతుంది. బ్యాట్స్‌మెన్ చూస్డూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయతకు లోనవుతాడు. 


సచిన్ టెండూల్కర్ అంటే భయం


ఇంతటి ప్రపంచ ప్రసిద్ధ బౌలర్‌కు టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే భయమట. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకున్నాడు. ఆ భయం ఎంతలా అంటే కలలోకి వచ్చి కూడా సిక్సర్లకు బాదేవాడట. దీనికి కారణం లేకపోలేదు. షార్జాలో 1998-99లో జరిగిన వన్డే సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ చేసిన తుపాను ఇన్నింగ్స్ దీనికి కారణం. ఇప్పటికే క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేని ఇన్నింగ్స్ ఇది. షేన్ వార్న్‌ను భయపెట్టింది కూడా ఇదే. ఆ ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్..షేన్ వార్న్ బౌలింగ్‌ను చితకబాదేశాడు. సచిన్‌ను ఆపడమనేది చాలా కష్టమని..తన తలపై సిక్సర్లు కొడుతున్నట్టుగా కలలు వచ్చేవని షేన్ వార్న్ చెప్పుకునేవాడు. సచిన్ స్థాయి క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ తప్ప మరొకరు లేరనేది షేన్ వార్న్ చెప్పేమాట. తనను అంతగా అభిమానించే షేన్ వార్న్ హఠాన్మరణం సచిన్ టెండూల్కర్‌ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.


Also read: Shane Warne Death: ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కెరీర్‌లో కీలక ఘట్టాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook