Novak Djokovic's Visa Cancelled By Australia For Second Time: ఆస్ట్రేలియా ఓపెన్‌ 2022 (Australia Open 2022)లో పాల్గొని రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్‌ సాధించాలని కలలు కన్న సెర్బియా స్టార్, టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic)కు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం (Australia Govt) శుక్రవారం (జనవరి 14) రెండోసారి జకో వీసా (Visa)ను రద్దు చేసింది. కరోనా వైరస్ నిబంధనలు పాటించనందుకు వీసా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతేకాదు సెర్బియా టెన్నిస్‌ స్టార్‌పై మూడేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో మూడేళ్లు జకోవిచ్‌ మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. జకో గ్రాండ్‌స్లామ్‌ ఆశ ఆవిరైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్‌ అలెక్స్‌ హాకే మాట్లాడుతూ... 'నోవాక్‌ జకోవిచ్‌ వీసా విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నాం. దేశ ప్రజల ఆరోగ్య భద్రత నేపథ్యంలోనే జకో వీసా (Novak Djokovic's Visa)ను రద్దు చేశాం. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ సరిహద్దులను రక్షించడానికి దృఢంగా కట్టుబడి ఉంది. ముఖ్యంగా COVID-19 మహమ్మారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది' అని పేర్కొన్నారు. నిబంధలనలకు విరుద్ధంగా ఆసీస్ వచ్చి 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో పాటు రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్‌ను గెలవాలనుకున్న జకోపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 


Also Read: Bangarraju Review: నాగార్జున- నాగచైతన్య బంగార్రాజు ఫైనల్ రివ్యూ.. ఎలా ఉందంటే.??


నోవాక్‌ జకోవిచ్‌ జనవరి 5న మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అయితే జకో వద్ద వాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికెట్ లేదు. దీంతో ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జకోవిచ్‌ వీసాను రద్దు చేసి అతడిని ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. అయితే తనకు వైద్య పరమైన మినహాయింపులు ఉన్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని జకోవిచ్‌ కోర్టుకు వెళ్లాడు. డిసెంబర్‌ 16వన తనకు కరోనా సోకిందని, దీంతో వాక్సినేషన్‌ అవసరం లేదంటూ తన లాయర్ల ద్వారా కోర్టులో వాదనలు వినిపించాడు. 


ఫెడరల్‌ కోర్టు నోవాక్ జకోవిచ్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. జకో వీసాను వెంటనే పునరుద్ధరించాలని, డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జకోవిచ్‌ డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చి హోటల్‌లో బస చేశాడు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తిరిగి ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. జనవరి 17 నుంచి మెగా ఈవెంట్‌ ప్రారంభమవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ హాకే తన విచక్షణా అధికారాన్ని ఉపయోగించి మరోసారి జకో వీసా రద్దు చేశారు. దాంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ 2022లో జకోవిచ్‌ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.


Aalso Read: Afghan Crisis: ఆఫ్గన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు.. కిడ్నీలు అమ్ముకుంటున్న పేదలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook