Babar Azam Hits Six Sixes: పాకిస్థాన్ జట్టు కెప్టేన్ బాబర్ ఆజం వరుసగా 6 సిక్సులు కొట్టాడు. కాకపోతే ఆ సిక్సులు కొట్టింది ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో కాదు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో మన ఐపిఎల్ తరహాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 (PSL) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 లో ప్రారంభ మ్యాచ్‌లోనే ఆ దేశ క్రికెట్ ప్రియులను ఉత్కంఠకు గురిచేసేలా లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో లాహోర్ ఖలందర్స్ జట్టు ముల్తాన్ సుల్తాన్ జట్టును ఓడించింది. చివరి బంతి వరకు విజయం దోబూచులాడటంతో పిఎస్ఎల్ ఫ్యాన్స్‌ని ఆ మ్యాచ్ తెగ సస్పెన్స్‌కి గురిచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక బాబర్ ఆజం వరుస సిక్సుల విషయానికొస్తే.. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 లో బాబర్ ఆజం పెషావర్ జల్మి జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ హిస్టరీలో బాబర్ ఆజం అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో పెషావర్ జల్మి జట్టు తొలి మ్యాచ్‌లో తలపడటానికి ముందుగా జరిగిన ట్రైనింగ్ సెషన్ మ్యాచ్‌లో బాబర్ ఆజం రెచ్చిపోయాడు. ఈ ట్రైనింగ్ సెషన్ మ్యాచ్‌లో బాబర్ ఆజం తన ఫిట్‌నెస్‌ని తనే చెక్ చేసుకుంటూ మొత్తం 9 సిక్సులు కొట్టగా.. అందులో వరుసగా 6 సిక్సులు ఉన్నాయి. 



 


2016 లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ లో తన కెరీర్ ఆరంభించిన బాబర్ ఆజం.. ఆ ఏడాది ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత 2017 నుంచి కరాచి కింగ్స్ జట్టు తరుపునే ఆడుతున్నాడు. అయితే ఈ ఏడాది జరిగిన వేలంలో కరాచి కింగ్స్ నుంచి బాబర్ ఆజంను పెషావర్ జల్మి జట్టు కైవసం చేసుకుంది. అందుకు బదులుగా పెషావర్ జల్మి జట్టు షోయబ్ మాలిక్, హైదర్ అలీలను కరాచి కింగ్స్ జట్టుకు వదిలేసుకుంది. విచిత్రం ఏంటంటే.. ఇన్నాళ్లు తాను ప్రాతినిథ్యం వహించిన కరాచి కింగ్స్ జట్టుతోనే ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజం పెషావర్ తరపున ఢీకొట్టనున్నాడు.


ఇది కూడా చదవండి : Hyundai verna 2023: కేవలం రూ. 25 వేలు చెల్లించి కొత్త హ్యూందాయ్ కారు బుక్ చేసుకోండి


ఇది కూడా చదవండి : OnePlus 11 5G Phone: వాలెంటైన్స్‌ డే నాడే అమ్మకాలు ప్రారంభించిన వన్‌ప్లస్ 11 5G ఫోన్


ఇది కూడా చదవండి : Noodles Making Video: ఈ వీడియో చూస్తే నూడుల్స్ ఇక జన్మలో తినరేమో !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook