Babar Azam Private Video: సహచర క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్, న్యూడ్ వీడియో కాల్.. బాబర్ ఆజమ్ తాజా పోస్ట్ వైరల్!
Pakistan Captain Babar Azam Latest Tweet Goes Viral after Alleged Private Videos shakes Internet. సహచర క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దొరికిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Babar Azam Latest Tweet Goes Viral after Alleged Private Videos shakes Internet: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ క్రికెటర్‌లలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఒకడు. మూడు ఫార్మాట్‌లలో అద్భుతంగా ఆడుతూ.. మాజీల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. కొందరు అయితే ఏకంగా టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు. ఇంకొందరు అయితే కోహ్లీని మించి పోతాడు అని కూడా అన్నారు. అలాంటి పాపులారిటీ ఉన్న బాబర్ ఆజమ్.. తాజాగా హనీ ట్రాప్‌లో చిక్కాడు. సహచర క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్, సెక్స్టింగ్ చేస్తూ దొరికిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
తోటి క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అభ్యంతరకర రీతిలో ఛాటింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బయటికొచ్చాయి. 'నువ్వు నాతో ఇలాగే ఛాటింగ్ చేస్తే.. నీ బాయ్ ఫ్రెండ్ పాకిస్థాన్ జట్టులో కొనసాగుతాడు' అని బాబర్ ఓ అమ్మాయితో అన్నట్లు వీడియోల్లో కనిపించింది. అంతేకాదు న్యూడ్ వీడియో కాల్ కూడా ఇలానే కొనసాగించాలని అతడు బెదిరించాడట. పాక్ సారథికి సంబంధించిన కొన్ని వాయిస్ మెసేజ్‌లు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
సహచర క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. తాజాగా ఓ ట్వీట్ పోస్ట్ చేసి పరోక్షంగా స్పందించాడు. సుఖంగా ఉండేందుకు మరీ అంత రిస్క్ చేయను అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు. ఈ పోస్టుకు నదీ తీరాన తీసుకున్న తన ఫోటోను జత చేశాడు. ఈ పోస్ట్‌లో బాబర్ నవ్వుతూ ఉన్నాడు. ఈ ట్వీట్ బట్టి చూస్తే.. తనపై నెట్టింట వస్తున్న ఆరోపణలను పట్టించుకోవడం లేదని చెప్పకనే చెప్పాడు. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు.
తోటి క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు అతడి ఫాన్స్ అండగా నిలుస్తున్నారు. వీడియోలో ఉన్నది బాబర్ కాదని.. కావాలనే కొనరు మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారని అంటున్నారు. దాంతో 'WeStandWithBabar' అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తనను పాక్ కెప్టెన్ బాబర్ బ్లాక్‌మెయిల్ చేశాడని హమీజా ముఖ్తర్ అనే యువతి గతంలో ఆరోపణలు చేసారు. బాబర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని, బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆమె చేశారు.
Also Read: Baleno Second Hand Cars: 4.5 లక్షలకే మారుతీ సుజుకి బాలెనో.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.