ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం..కాంస్యం గెలిచిన బజరంగ్
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటాడు. పురుషుల 65 కిలోల కుస్తీపోటీల్లో కాంస్య పతకం సాధించి...భారత్ గర్వపడేలా చేశాడు.
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్(Tokyo olympics)లో భారత్‌కు మరో పతకం సాధించింది. రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో రెజ్లర్ బజరంగ్ పూనియా(Bajrang Poonia) కాంస్య పతక పోరులో గెలిచాడు. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
కాంస్యపతాక పోరులో కజకిస్థాన్(Kazakhstan)కు చెందిన నియాజ్బెకోవ్ దౌలెత్ ను 8-0 తేడాతో ఓడించాడు బజరంగ్. ఈ పోరులో బజరంగ్ పూర్తిగా ఆధిపత్యం కనబరిచాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు రక్షణాత్మకంగా ఆడుతూనే మరోవైపు దూకుడు చూపించి కాంస్యాన్ని ఒడిసి పట్టాడు.
Also Read: Tokyo olympics: జయహో నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఫస్ట్ గోల్డ్‌మెడల్
ఎన్నో అంచనాల మధ్య ఫేవరేట్‌గా బరిలో దిగిన బజరంగ్ పునియా.. సెమీఫైనల్లో అజర్‌బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీ చేతిలో 5-12 తేడాతో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. అయితే సెమీస్‌లో అతడి డిఫెన్స్ బాగా లేకపోవటం కారణంగానే అతడు ప్రత్యర్థికి తలవంచాడు.అయినా.. ఇప్పుడు కంచు పట్టి భారత్‌ను తలెత్తుకునేలా చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook