IPL 2022: క్రికెట్ ఆటలోనే కాదు..ఆట చుట్టూ కూడా అదృష్టం పొంచి ఉంటుంది. అందుకే ఆ బంగ్లాదేశ్ ఆటగాడికి తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ రంగంలో దిగనున్నాయి. ఇప్పటికే మెగా వేలం పూర్తి కావడంతో జట్లన్నీ దాదాపుగా సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో అంటే ఇక ఐపీఎల్‌కు ఆడేందుకు అవకాశాలు దాదాపుగా ఎవరికీ లేని సమయంలో..ఆ ఆటగాడికి అదృష్టం వరిస్తోంది. తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తోంది. 


ఐపీఎల్ 2022లో మార్క్‌వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ చేజిక్కించుకుంది. అయితే గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు దూరమవుతున్నాడు. వెస్టిండీస్-ఇంగ్లండ్ రెండవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన మార్క్‌వుడ్ ఐపీఎల్‌లో ఆడే పరిస్థితి లేదు. దాంతో మార్క్‌వుడ్ స్థానాన్ని బంగ్లాదేశ్ స్టార్ పేసర్ టాస్కిన్ అహ్మద్‌తో భర్తీ చేయాలనేది లక్నో సూపర్ జెయింట్స్ ఆలోచన. ఇందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సంప్రదించినట్టు సమాచారం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు..ఇంకొన్ని రోజులు అలాగే ఉండనుంది. టాస్కిన్ అహ్మద్ ఇప్పటివరకూ ఐపీఎల్‌కు ఆడలేదు. లక్నో నుంచి అవకాశం ఓకే అయితే తొలిసారి అవుతుంది. టీమ్ ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సారధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్‌ను మార్చ్ 28వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.


Also read: Shabaash Mithu Teaser: శభాష్‌ మిథు టీజర్ వచ్చేసింది.. బ్లూ జెర్సీలో మెరిసిన తాప్సీ! రవిశాస్త్రి అదుర్స్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook