IPL 2024 full schedule: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది... ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
IPL 2024 Updates: ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. తాజాగా షెడ్యూల్‌ను అనౌన్స్ చేసింది. ఫైనల్ ఫైట్ కు చెన్నైలోని చెపాక్ స్డేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
IPL 2024 full schedule: ఐపీఎల్ 2024 సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లు జట్లు హోరాహోరీగా తలపడతున్నాయి. ఈ క్రమంలో తాజా సీజన్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఎన్నికల నేపథ్యంలో యూఏఈలో నిర్వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ వాటిన్నింటిని కొట్టిపారేస్తూ మెుత్తం మ్యాచ్ లను భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికల ఉన్నప్పటికీ.. మెుత్తం 74 మ్యాచులను మనదేశంలోనే నిర్వహించనున్నారు. అంతేకాదు క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను మోథేరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలోనూ, క్వాలిఫైయర్ 2 మరియు ఫైనల్ మ్యాచులను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మే 26వ తేదీన టైటిల్ పోరు జరగనుంది. అంటే 12 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ తుది పోరుకు చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతుంది.
రెండో దశ మ్యాచ్‌లు ఎప్పటి నుంచంటే..
ఏప్రిల్ 7వ తేదీన తొలి దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రోజు నుంచే రెండో దశ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్(CSK), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్లు తలపడనున్నాయి. మే 21వ తేదీన క్వాలిఫయర్ 1, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 24వ తేదీన క్వాలిఫయర్ 1, మే 26న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై.. జూన్ 01న ముగుస్తాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను జూన్ 04న వెల్లడించనున్నారు. ఎన్నికల దృష్ట్యా మ్యాచులకు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు బీసీసీఐకు సవాల్ గా మారింది.
Also Read: GT vs MI: తొలి మ్యాచ్‌లో ముంబై బోల్తా.. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ తొలి విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి