Team India new chief selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. 45 ఏళ్ల అజిత్ ను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఫిబ్రవరిలో చేతన్ శర్మ రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న ఈ పదవిలో అగార్కర్ ను బోర్డు ఎంపిక చేసింది. ఈయనతోపాటు శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ లు కూడా సెలక్షన్ కమిటీ మెంబర్స్ గా ఉంటారని క్రికెట్ బోర్డు తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త చీఫ్ సెలక్టర్ కోసం వివిధ జోన్లు నుంచి బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది. అశోక్ మల్హోత్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ వర్చువల్ విధానంలో అజిత్ అగార్కర్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ కమిటీలో సులక్షన్ నాయక్, జతిన్ పరాంజపే కూడా ఉన్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ గా అజిత్ ను ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు కమిటీ సభ్యులు. సీఏసీ సూచన మేరకు అగార్కర్ ను చీఫ్ సెలక్టర్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అగార్కర్ నేతృత్వంలో వెస్టిండీస్ తో జరగబోయే టీ20 సిరీస్ కు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. 


అజిత్ అగార్కర్ భారత్ తరుపున 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. ఇండియా తరుపున  మొత్తం  349 వికెట్లు తీశాడు. 1999, 2003, 2007లో వన్డే ప్రపంచకప్ టీమిండియా జట్టులో కీలక ఆటగాడిగా అజిత్ ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అజిత్ కీలకపాత్ర పోషించాడు. దీంతోపాటు లార్డ్స్  మైదానంలో టెస్టు సెంచరీ చేసిన రికార్డు ఇతడి పేరిట ఉంది. 


Also Read: IPL 2023: ఐపీఎల్ లో ఆడనందుకు ఆ ముగ్గురు ఆటగాళ్లకు రివార్డు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK