IND vs SA: టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా ఆడనున్నాడా..? బీసీసీఐ చీఫ్ క్లారిటీ..!
IND vs SA: టీమిండియా పేసర్ బుమ్రా..టీ20 ప్రపంచ కప్‌నకు అందుబాటులో ఉంటాడా..లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో దీనిపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.
IND vs SA: గాయం కారణంగా మరోమారు భారత జట్టుకు పేసర్ బుమ్రా దూరమయ్యడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న మరో రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఆడటం లేదు. అతడి స్థానంలో హైదరాబాద్ పేసర్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రపంచ కప్ ముందు బుమ్రా గాయపడటంతో భారత జట్టుకు షాక్ తగినట్లు అయ్యింది. వరల్డ్ కప్‌లోపు అతడు కోలుకునే అవకాశమే లేదు. ఐనా దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈనేపథ్యంలో బుమ్రా ఇష్యూ గురించి బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తొలిసారి మాట్లాడాడు. బుమ్రా భవిష్యత్ గురించి ఓ నిర్ధారణకు రావడం తొందరపాటే అవుతుందన్నాడు. అతడు ఇంకా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించలేదని స్పష్టం చేశాడు. దీనిపై ఇంకా ఉత్కంఠ ఉందన్నాడు. అతడు జట్టుకు దూరమైనట్లు ఇప్పుడే చెప్పలేమన్నాడు గంగూలీ. ఈమేరకు ఓ క్రీడా ఛానల్‌లో స్పందించాడు.
బుమ్రా గాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్వదేశంలో భారత జట్టు..దక్షిణాఫ్రికాతో ఆడుతోంది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రేపు రెండో మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. దీని తర్వాత నేరుగా టీమిండియా..ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్టోబర్ 13 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.
భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. రోహిత్ సేన ఉన్న గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌ల బలమైన జట్లు ఉండటంతో వరల్డ్ కప్ రసవత్తరంగా సాగనుంది. ఆస్ట్రేలియా పిచ్‌లన్నీ బౌన్సి పిచ్‌లు కావడంతో బౌలర్లే కీలకం కానున్నారు. ఈనేపథ్యంలో బుమ్రా రాకపై భారత జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతడు ఆడకపోతే షమీ సైతం ఆడించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
మరోవైపు యువ పేసర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను ఆస్ట్రేలియా పంపనున్నట్లు తెలుస్తోంది. వీరి ఇద్దరు భారత జట్టుతో ఉండనున్నారు. నెట్ బౌలర్లు సేవలు అందించనున్నారు. గాయాలు బెడత వెంటాడుతున్న క్రమంలోనే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీనియర్ పేసర్ షమీ స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. అతడు సైతం తుది జట్టులోకి వచ్చే సూచనలు ఉన్నాయి.
[[{"fid":"247063","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:విజయ్, నా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!
Also read:Mission Bhagiratha: మిషన్ భగీరథకు అవార్డు పచ్చి అబద్దం.. టీఆర్ఎస్ ది చిల్లర వ్యవహారమన్న కేంద్రం
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి