IPL 2024 Auction: ఓవైపు ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జరుగుతుండగానే ఐపీఎల్ 2024 కోసం బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. ఐపీఎల్ జరిగేది వచ్చే ఏడాది అయినా అత్యంత కీలకమైన వేలం ప్రక్రియ మాత్రం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఈసారి ఐపీఎల్ వేలం ప్రక్రియ ఎక్కడ జరగనుందంటే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ క్రికెట్‌కు అంతర్జాతీయంగా క్రేజ్ పెరుగుతోంది. వచ్చే ఏడాది అంటే ఐపీఎల్ 2024 వేలం ప్రక్రియ ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ నెలలో జరగనుంది. ఈసారి వేలం ప్రక్రియను ఇండియాలో కాకుండా దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం. డిసెంబర్ 15 నుంచి 19 మధ్యలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం ప్రక్రియ జరగనుంది. గత ఏడాది ఐపీఎల్ వేలం ప్రక్రియ కొచ్చిలో జరిగింది. 


ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల వేలం ద్వారా బీసీసీఐ 48 వేల కోట్లు ఆర్జించింది. ఈసారి ఐపీఎల్ ప్రాచుర్యం మరింతగా పెంచేందుకు దుబాయ్‌లో నిర్వహించాలనేది బీసీసీఐ ఆలోచన. వన్డే ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తరువాత ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వివరాలు తెలియనున్నాయి. డిసెంబర్ రెండవ వారంలో మహిళల ఐపీఎల్ వేలం ప్రక్రియ జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత ఐపీఎల్ వేలం ఉండవచ్చు. వన్డే ప్రపంచకప్ ముగిసిన తరువాత వివిధ ఫ్రాంచైజీ జట్లు రిటైన్ ప్లేయర్ల జాబితా వెలువరించాల్సి ఉంది. ఆ  జాబితా ఆధారంగా వేలానికి సిద్ఘంగా ఉన్న ఆటగాళ్లు ఎవరు, ఏ జట్టు వ్యాలెట్ ఎలా ఉందనేది తెలియనుంది. 


Also read: Glenn Maxwell: నెదర్లాండ్స్‌పై గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసం.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook