T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
T20 World Cup 2022: ఆస్ట్రేలియలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కొద్దిరోజులే మిగిలుంది. టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. టీమ్ ఇండియాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు వెళ్తున్నట్టు సమాచారం.
T20 World Cup 2022: ఆస్ట్రేలియలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కొద్దిరోజులే మిగిలుంది. టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. టీమ్ ఇండియాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు వెళ్తున్నట్టు సమాచారం.
టీ20 ప్రపంచకప్ 2022కు టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. జస్ప్రీత్ బూమ్రా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవల్సి వచ్చింది. బూమ్రా స్థానంలో ఎవరు, బౌలింగ్ విభాగంలో ఎవరెవరుంటారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే జరిగేది ఫాస్ట్ పిచ్‌లకు అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా గడ్డపై.
ఇప్పటికే ఆసియా కప్‌లో టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం గట్టిగా లేకపోవడంతో విఫలమైంది. సూపర్ 4కు ముందే నిష్క్రమించింది. ఆ కప్‌లో జడేజా, బూమ్రా లేనిలోటు స్పష్టంగా కన్పించింది. ఇప్పుడు కూడా టీ20 ప్రపంచకప్‌కు బూమ్రా దూరమయ్యాడు. జడేజా పరిస్థితిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ క్రమంలో బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ సిరాజ్‌పై సెలెక్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై సిరాజ్ గతంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన పరిస్థితి ఉంది.
తుది జట్టు సంగతి తేలకపోయినా..ఆస్ట్రేలియాకు టీమ్ ఇండియా తరపున మొహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు వెళ్తున్నట్టు తెలుస్తోంది. బ్యాకప్ ప్లేయర్స్, నెట్ బౌలర్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో సిరాజ్, ఉమ్రాన్‌లను కూడా ఆస్ట్రేలియాకు పంపిస్తున్నట్టుగా బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. అదృష్టం కలిసొస్తే..ఇద్దరూ లేదా ఇద్దరిలో ఒకరు కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌కు ఆడవచ్చు.
Also read: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో ఆ రెండు జట్లే ఫెవరెట్.. షేన్ వాట్సన్ జోస్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook