Netizens trolls BCCI after Mohammad Shami, Sanju Samson Missing Out on Indias T20 World Cup 2022 Squad: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16 నుంచి టీ20 ప్రపంచకప్‌ 2022 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. తాజాగా ముగిసిన ఆసియా కప్‌ 2022లో పాల్గొన్న జట్టునే దాదాపుగా కొనసాగించారు బీసీసీఐ సెలెక్టర్లు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, ఐపీఎల్ స్టార్ హర్షల్‌ పటేల్‌లు జట్టులోకి తిరిగి రాగా.. గాయపడ్డ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ జట్టులో కొనసాగనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం ప్రకటించిన జట్టులో పేసర్ మహమ్మద్‌ షమీ, కీపర్‌ సంజూ శాంసన్‌ పేర్లు లేవు. షమీని స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. శాంసన్‌ను మాత్రం అసలు పరిగణలోకే తీసుకోలేదు. దీంతో సంజూ, షమీ అభిమానులే కాకుండా నెటిజన్లు బీసీసీఐపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ 2022తో పాటు అంతకుముందూ అద్భుతంగా రాణించిన వీరిని ఎందుకు ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇతర ఆటగాళ్లతో పోల్చుతూ బీసీసీఐ సెలెక్టర్లపై మండిపడుతున్నారు. 


ముఖ్యంగా సంజూ శాంసన్‌ విషయంలో ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. 'రిషబ్ పంత్‌ ఎన్నిసార్లు విఫలమయినా అవకాశాలు ఇచ్చారు.. బాగా ఆడుతున్న సంజూకు ఎందుకు జట్టులో చోటివ్వట్లేదు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'రిషబ్ పంత్‌కు దక్కినన్ని అవకాశాల్లో శాంసన్‌కు 10శాతం దక్కినా బాగుండు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'సంజూ విషయంలో బీసీసీఐ డ్రామాలాడుతోంది', 'బీసీసీఐ రాజకీయాలు చేస్తోంది', 'షమీని పక్కన పెట్టాం ఏంటి' అని ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో ట్విట్టర్‌లో సంజూ, షమీ పేర్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. 


ఐపీఎల్ 2022లో గుజరాత్‌ టైటాన్స్ తరఫున ఆడిన మహమ్మద్‌ షమీ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో యార్కర్లతో వికెట్లు పడగొట్టాడు. షమీ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించగలడు. అంతేకాదు టీమిండియాకు సీనియర్ పేసర్ కూడా. మరోవైపు సంజూ శాంసన్‌ ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన చేశాడు. రాజస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్‌ స్క్వాడ్‌లో ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు. 



ప్రపంచకప్‌ 2022కు భారత జట్టు: 
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్ పంత్‌ (కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, ఆర్ అశ్విన్‌, యుజ్వేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.
స్టాండ్‌ బై ప్లేయర్లు: మహమ్మద్‌ షమీ, శ్రేయాస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌, దీపక్‌ చహర్‌. 




Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా పసిడి ధర! పెరిగిన వెండి రేటు


Also Read: Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook