Sourav Ganguly admitted to Kolkata Woodlands hospital | న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరారు. శనివారం ఉదయం దాదాకు ఛాతిలో నొప్పి రావడంతో కుటంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ (Sourav Ganguly) ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమాచారం ప్రకారం.. 
(BCCI president) గంగూలీ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు అస్వస్థతకు గురయ్యారని ఆ తర్వాత వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి వెళ్లినట్లు పేర్కొంటున్నారు. గంగూలీని పరీక్షించిన వైద్యులు కార్డియాక్ సమస్య ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన్ను డార్టర్‌ సరోజ్‌ మొండల్‌తోపాటు ముగ్గురు వైద్య నిపుణులు పరీక్షిస్తున్నారు. అయితే సాయంత్రం నాటికి గుండెకు యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు సమచారం. Also Read: 
Buta Singh passed away: కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత


గంగూలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్ చేసి ఆకాంక్షించారు. సౌరవ్ గంగూలీ పూర్తిస్థాయిలో త్వరగా కోలుకోవాలంటూ మమతా ట్విట్ చేశారు. 


 Also Read: India Covid-19: 99లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook