IND vs WI: ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం.. ప్రేక్షకులను అనుమతించం! వారికి మాత్రమే ప్రవేశం: గంగూలీ
IND vs WI T20I Series: కరోనా అధికంగా ఉన్న ఈ సమయంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని, ప్రేక్షకులను ఎట్టిపరిస్థితుల్లో మైదానాల్లోకి అనుమతించం అని సౌరవ్ గంగూలీ చెప్పారు.
Fans not allowed for IND vs WI T20I Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అన్ని టీ20 మ్యాచులు జరగనున్నాయి. వన్డే సిరీస్ మాదిరిగానే పొట్టి సిరీస్ కూడా ప్రేక్షకులు లేకుండానే జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.
నిజానికి బెంగాల్ ప్రభుత్వం కరోనా వైరస్ నిబంధనలను సడలించి ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 75 శాతం ప్రేక్షకులకు అనుమతిని ఇచ్చింది. సుమారు 50 వేల మంది ప్రేక్షకులు మైదానానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కానీ బీసీసీఐ మాత్రం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఈ సమయంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని, ప్రేక్షకులను ఎట్టిపరిస్థితుల్లో మైదానాల్లోకి అనుమతించం అని సౌరవ్ గంగూలీ చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ పాల్గొనగా.. కోల్‌కతాలో ప్రేక్షకుల ప్రవేశం గురించి రీపోటర్లు ప్రశ్నలు అడిగారు. వాటిపై దాదా స్పందిస్తూ... 'టీ20 సిరీస్ కోసం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రేక్షకులను అనుమతించడం లేదు. సాధారణ ప్రజలకు టిక్కెట్లు విక్రయించడం లేదు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు, పలు యూనిట్ల ప్రతినిధులకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రేక్షకులను అనుమతి ఇచ్చి ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం' అని పేర్కొన్నారు.
టీమిండియా పర్యటన కోసం ఇప్పటికే వెస్టిండీస్ జట్టు భారత్ చేరుకుంది. మరోవైపు జనవరి 31న అహ్మదాబాద్ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే టీమిండియాలో ముగ్గురు ఆటగాళ్లే కాకుండా సహాయక సిబ్బంది కూడా కరోనా బారిన పడడంతో బీసీసీఐ అప్రమత్తం అయింది. శిఖర్ ధావన్, రితురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ వైరస్ బారిన పడ్డారు. వీరి స్థానంలో మయాంక్ అగర్వాల్, ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చారు.
Also Read: Anasuya Bharadwaj Photoshoot: మత్తేక్కించే చూపులతో కట్టిపడేస్తున్న యాంకర్ అనసూయ
Also Read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook