Ganguly tested positive for Delta Plus variant: బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మళ్లీ కరోనా బారిన పడ్డారు. అయితే ఈ సారి అతడికి కరోనా డెల్టా ప్లస్​ వేరియంట్​ (Delta Plus variant) సోకింది. శనివారం రాత్రి చేసిన పరీక్షల్లో దాదాకు పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు వుడ్‌లాండ్స్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కరోనా బారిన పడిన గంగూలీ (Ganguly Corona) కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు ఒమిక్రాన్‌ (Omicron) పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగెటివ్‌ వచ్చింది. దీంతో దాదాను శుక్రవారం(డిసెంబరు 31) సాయంత్రం డిశ్ఛార్జి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఒక్కరోజు వ్యవధిలోనే గంగూలీకి మరోసారి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు డెల్టా ప్లస్‌ పాజిటివ్‌గా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో (home isolation) ఉండాలని సూచించామన్నారు. 


Also Read: Breaking News: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి కరోనా.. వుడ్‌లాండ్‌ ఆస్పత్రిలో చేరిక!!


ఈ ఏడాది ఆరంభంలో గంగూలీ గుండె పోటుకు ( cardiac arrest) గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స కూడా చేశారు. దాదా గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉండడంతో స్టెంట్లు వేశారు. అనంతరం ఆయన కోలుకున్నారు. ఇటీవలే దాదా సోదరుడు, తల్లి కొవిడ్​ బారినపడి కోలుకున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి