COVID-19: 2000 Oxygen concentrators విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చిన BCCI
BCCI to donate 2000 oxygen concentrators: న్యూ ఢిల్లీ: కరోనాపై పోరులో యుద్ధం చేస్తోన్న మన దేశానికి మరోసారి తమ వంతు సహకారం అందించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అందులో భాగంగానే 2000 ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
BCCI to donate 2000 oxygen concentrators: న్యూ ఢిల్లీ: కరోనాపై పోరులో యుద్ధం చేస్తోన్న మన దేశానికి మరోసారి తమ వంతు సహకారం అందించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అందులో భాగంగానే 2000 ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఇదే విషయమై బీసీసీఐ సెక్రెటరీ జే షా మాట్లాడుతూ.. కొవిడ్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో మనమంతా పరస్పర సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కరోనా రోగుల సంఖ్య పెరిగి వైద్య వ్యవస్థపై భారం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆక్సీజన్ కాన్‌సంట్రేటర్స్ కొరతను అధిగమించేందుకు తమ వంతుగా 2000 ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ అందించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కడెక్కడైతే ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ కొరత ఉందో.. అక్కడక్కడ వాటిని అందించనున్నట్టు జే షా స్పష్టంచేశారు.
Also read : Ayush Report: కృష్ణపట్నం మందుతో ఎలాంటి ప్రమాదం లేదు, ముఖ్యమంత్రి చేతికి నివేదిక
కొవిడ్-19 వ్యాక్సినేషన్ (COVID-19 vaccination) గురించి జేషా మాట్లాడుతూ.. ''అర్హులైన ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా జే షా విజ్ఞప్తి చేశారు. గతేడాది కరోనా యావత్ ప్రపంచాన్ని వణికించిన సమయంలోనూ బీసీసీఐ భారత్‌కి తమ వంతు సహకారంగా రూ. 51 కోట్లు విరాళంగా (BCCI donation to PM CARES Fund) అందించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి దేశంలో చాలా చోట్ల ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ (oxygen concentrators) కొరత వేధిస్తున్నందున బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జే షా తెలిపారు.
మరోవైపు టీమిండియా క్రికెటర్స్ సైతం తమ వంతుగా విరాళాలు అందిస్తూనే ఉన్నారు. టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్కా శర్మ దంపతులు తాము సొంతంగా సేకరించిన విరాళాల నిధికి రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు. అలాగే సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, పాండ్య బ్రదర్స్, అజింక్య రహానే వంటి క్రికెటర్స్‌తో పాటు ఇంకెంతో మంది విరాళాలు అందించారు.
Also read : Anandaiah medicine: కృష్ణపట్నం మందుపై త్వరలో క్లినికల్ ట్రయల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook