BCCI to Name Rohit Sharma as India's New Test Captain: తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ (IND vs SA Test Series) ఓటమి అనంతరం టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) తప్పుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో కోహ్లీ నిర్ణయంతో ప్రతి ఒక్కరు షాక్ తిన్నారు. కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా తప్పుకోవడంతో టీమిండియా కొత్త కెప్టెన్‌ (India New Test Captain) ఎవరు అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. మాజీలు, క్రికెట్ విశ్లేషకులు తమతమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. జట్టులోని జూనియర్ ఆటగాళ్లకు జట్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని చాలా మంది సూచనలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma)కే టెస్ట్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరోవైపు కేఎల్‌ రాహుల్‌, రిషబ్ పంత్‌ పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. రోహిత్ వయసు, ఫిట్‌నెస్‌ రీత్యా పంత్‌కు టెస్ట్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని మాజీలు సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఇప్పటికే టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసిందట. హిట్‌మ్యాన్‌కే టెస్టు కెప్టెన్సీ కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్టు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. 


Also Read: Virat Kohli - Kapil Dev: కోహ్లీ ఇగోను వదిలేసి.. జూనియర్ల కెప్టెన్సీలో ఆడాలి! నేనూ అలాగే ఆడా: కపిల్‌ దేవ్‌


'భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు అతడు టెస్ట్ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు సారథిగా ఉండబోతున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 'మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అంటే పనిభారం అధికం అవుతుంది. అందుకే రోహిత్ తనను తాను చాలా చురుగ్గా, ఫిట్‌గా ఉంచుకోవాలి. హిట్‌మ్యాన్‌ తన ఫిట్‌నెస్‌పై మరింత ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. 


'వైస్‌ కెప్టెన్‌ భవిష్యత్తు కెప్టెన్‌ అవుతాడు. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), రిషబ్ పంత్‌ (Rishabh Pant), జస్ప్రీత్ బుమ్రా (Bumrah) లాంటి ప్లేయర్స్ భవిష్యత్తు నాయకులు. వీరిని సారథులుగా తీర్చిదిద్దే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వైస్‌ కెప్టెన్‌ ఎవరన్న అంశంపై తీవ్ర కసరత్తు జరుగుతోంది' అని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు. జట్టులో అజింక్య రహానే, ఛతేశ్వర్‌ పుజారా ఉన్నా.. వారు ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్నారు. దాంతో వారిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. 


Also Read: Janhvi Kapoor Swimsuit: వీకెండ్ వైబ్స్.. స్విమ్‌ సూట్‌లో జాన్వీ కపూర్ అందాల విందు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook