Beijing Winter Olympics 2022: నేటి నుంచే వింటర్ ఒలింపిక్స్... ప్రారంభ, ముగింపు వేడుకలకు భారత్ దూరం!
Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్ కు బీజింగ్ సిద్ధమైంది. వణుకు పుట్టించే చలిలో పతకాల వేట ప్రారంభకానుంది. నేటి నుంచే చైనాలో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి.
Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్-2022 పోటీలు (Winter Olympics 2022) నేటి (ఫిబ్రవరి 04) నుంచి అధికారికంగా ప్రారంభంకానున్నాయి. చైనాలోని బీజింగ్, యాంకింగ్, చోంగ్లీలలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. క్రీడల ప్రారంభానికి ముందు... ఫిబ్రవరి 02న మూడు రోజుల టార్చ్ రిలేను ప్రారంభించారు.
ఈ ఒలింపిక్స్ లో 90 దేశాలకు చెందిన దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. 7 క్రీడల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు జరగబోతున్నాయి. ప్రఖ్యాత బీజింగ్ జాతీయ స్టేడియం (బర్డ్‌నెస్ట్)లో శుక్రవారం ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే కర్లింగ్, లూజ్, స్కై జంపింగ్, అల్పైన్ స్కీయింగ్, ఫ్రీస్టయిల్ స్కీయింగ్, ఐస్ హాకీ, స్కై జంపింగ్ విభాగాల్లో పోటీలు ఆరంభమయ్యాయి. శనివారం నుంచి పతకాల ఈవెంట్లు జరగనున్నాయి.
14 ఏళ్ల తర్వాత...
కరోనా కారణంగా..ఈ సారి విదేశీ వీక్షకులకు ప్రవేశం లేదు. అంతేకాదు అథ్లెట్లు, అధికారుల కోసం ప్రత్యేకమైన క్లోజ్డ్ లూప్ సిస్టమ్ (బబుల్)ను ఏర్పాటు చేశారు. 2008 బీజింగ్ లో మెుదటిసారి వేసవి ఒలింపిక్స్ నిర్వహించారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రెండోసారి ఇక్కడ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు.
ఈసారి క్రీడల్లో కొత్తగా.. ఫ్రీ స్టయిల్ స్కీయింగ్ (మిక్స్‌డ్ జెండర్ టీమ్ ఏరియల్స్), ఫ్రీస్టయిల్ స్కీయింగ్ (పురుషుల బ్యాగ్ ఎయిర్), ఫ్రీస్టయిల్ స్కీయింగ్ (మహిళల బిగ్ ఎయిర్), షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ (మిక్స్‌డ్ టీమ్ రిలే), స్కై జంపింగ్ (మిక్స్‌డ్ టీమ్), స్నో బోర్డింగ్ (మిక్స్‌డ్ టీమ్ స్నో బోర్డ్ క్రాస్) విభాగాలు చోటు సంపాదించుకున్నాయి.
ఒలింపిక్స్ వేడుకల ప్రసారాలు బంద్!
బీజింగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ (Beijing Winter Olympics 2022) ప్రారంభ, ముగింపు వేడుకలను డీడీ స్పోర్ట్స్ (DD Sports) ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయదని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి గురువారం తెలిపారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు హాజరుకాబోమని చైనాకు భారత్ (India) చెప్పింది. ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా గల్వాన్ ఘటనలో (Galwan valley clash) గాయపడిన.. ఆ దేశ ఆర్మీ అధికారిని చైనా ఎంపిక చేసిన నేపథ్యంలో భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. . ఈసారి వింటర్ ఒలింపిక్స్ కు భారత్ నుంచి కశ్మీర్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ ఒక్కడే అర్హత సాధించాడు. ఆరిఫ్ ఖాన్ స్కీయింగ్‌లో పోటీపడబోతున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook