Paralympics: ఒకే రోజు భారత్ కు మూడు పతకాలు.. టేబుల్ టెన్నిస్‌లో భవీనాకు, హైజంప్‌లో నిషాద్ కుమార్ కు రజతాలు
Paralympics: టోక్యోలో మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. పారా ఒలింపిక్స్ లో ఇండియాకు ఆదివారం మూడు పతకాలు లభించాయి. టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ రజతం సాధించి..భారత్ కు తొలి పతకం అందించింది. అనంతరం హైజంప్ లో నిషాద్ కుమార్ రజత పతకం సాధించగా...డిస్కస్‌త్రోలో వినోద్ కుమార్‌కు కాంస్య పతకంతో మెరిశాడు.
Paralympics: టోక్యో పారా ఒలింపిక్స్ లో....భారత్ కు తొలి పతకం దక్కింది. మహిళల సింగిల్స్ క్లాస్ -4 టేబుల్ టెన్నిస్ లో స్టార్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ రజతం(Siver) సాధించింది. చైనా(China)కు చెందిన ప్రపంచ నెంబర్ వన్ జావో యింగ్ తో జరిగిన ఫైనల్ పోరులో 0-3తేడాతో ఓటమి పాలైంది. పారా ఒలింపిక్స్ చరిత్రలో...టేబుల్ టెన్నిస్ లో భారత్ కు పతకం రావటం ఇదే మొదటిసారి. 34ఏళ్ల భవీనాబెన్ పటేల్(Bhavina Ben Patel).... పారా ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
గుజరాత్‌లోని మెహసానాకు చెందిన భవీనాబెన్ తొలిసారి 2016 రియో పారాలింపిక్స్(Rio Paralympics) కు ఎంపికైంది. అయితే ఆమె సాంకేతిక కారణాల వల్ల ఆ పోటీల్లో పాల్గొనకలేకపోయినప్పటికీ.. పట్టుదలను మాత్రం వీడలేదు. టోక్యో పారాలింపిక్స్(Tokyo Paralympics) లోకి అడుగుపెట్టింది. మొదటి మ్యాచ్ నుంచి తన స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనా పోలియో(Polio) కారణంగా చిన్నప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆ సమయంలో కుటుంబం అండగా నిలిచింది. ఆమెను ప్రోత్సహించింది.
Also Read: Frederique Overdijk: 4 ఓవర్లలో 7 వికెట్లు తీసి T20Is వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన పేసర్ ఫ్రెడ్రిక్
2004లో భవీనా తండ్రి ఆమెను అహ్మదాబాద్(Ahmedabad)లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో చేర్పించడంతో టేబుల్ టెన్నిస్(Table Tennis) కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. వైక్యలం ఉందని బాధపడకుండా.. పట్టుదలతో శ్రమించింది.. జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో ఓడినా ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. పారాలింపిక్స్(Paralympics) చరిత్రలో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి.
భారత్‌కు మరో రజతం.. హైజంప్‌లో మెరిసిన నిషాద్ కుమార్
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది. కొద్దిసేపటి క్రితం జరిగిన పురుషుల హైజంప్ పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్‌కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. దాంతో అతడు రజతం సాధించాడు. అంతకుముందు మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలోనూ భారత్ తరఫున భవీనా పటేల్ సైతం రజతం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కడం విశేషం.
డిస్కస్‌త్రోలో వినోద్ కుమార్‌కు కాంస్య పతకం
F52 డిస్కస్‌త్రో పోటీల్లో 41 ఏళ్ల వినోద్.. 19.91 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడమే కాకుండా ఆసియాలోనే అత్యుత్తమ రికార్డు నెలకొల్పిన అథ్లెట్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook