ENG vs IND 5th Test: చెత్త బౌలింగ్.. టీమిండియా బౌలర్లపై సెహ్వాగ్ ఫైర్!
ENG vs IND 5th Test, Virender Sehwag slams Indian bowlers. చెత్త బౌలింగ్ కారణంగా మ్యాచ్ చేజారిందని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు.
Virender Sehwag slams Indian bowlers: బర్మింగ్‌హామ్ వేదికగా భారత్‌తో మంగళవారం ముగిసిన ఐదో టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జో రూట్ (142 నాటౌట్; 173 బంతుల్లో 19x4, 1x6), జానీ బెయిర్‌స్టో (114 నాటౌట్; 145 బంతుల్లో 15x4, 1x6) సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. దాంతో ఇంగ్లీష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
కీలక మ్యాచ్‌లో మూడు రోజుల పాటు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ చివరి రెండు రోజుల్లో చేతులెత్తేసింది. ముఖ్యంగా చెత్త బౌలింగ్ కారణంగా మ్యాచ్ చేజారింది. ఇదే విషయమై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు. 'అత్యధిక లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు. భారత్ పరిష్కరించుకోవడానికి కొన్న్ని సమస్యలు ఉన్నాయి. టాప్ 6 బ్యాట్స్‌మెన్‌లో చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ మినహా అందరూ విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ చెత్తగా ఉంది. పసలేని బౌలింగ్‌లా కనిపించింది' అని అన్నాడు.
'ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్ ఎవరంటే జో రూట్ పేరే చెబుతా. ఈ టెస్ట్ సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించడం అద్భుతం. రూట్ ఓ పరుగుల యంత్రం. తన పరుగులతో ఇంగ్లండ్ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు' అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఇంగ్లండ్ విజయాన్ని ప్రశంసించాడు. 'చిరస్మరణీయ విజయాన్నందుకున్న ఇంగ్లండ్‌కు అభినందనలు. జానీ బెయిర్‌స్టో, జో రూట్ అద్భుత ప్రదర్శనతో బ్యాటింగ్ చాలా సులువని మరోసారి చాటి చెప్పారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ బాగుంది' అని అన్నాడు.
Also Read: Keeravani: రసూల్ ను దారుణమైన పదంతో ట్రోల్ చేసిన కీరవాణి.. ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: Major Closing Collections: అడవి శేష్ మేజర్ మూవీ ఎన్ని కోట్లు లాభం సాధించిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook