ఫిఫా 2018: దుమ్మురేపిన బ్రెజిల్
ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ తన సత్తా చాటింది. రెండో రౌండ్‌లో మెక్సికోతో చెలరేగిన పోరులో 2-0 గోల్స్ తేడాతో విజయ దుందుభి మోగించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది
ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ తన సత్తా చాటింది. రెండో రౌండ్‌లో మెక్సికోతో చెలరేగిన పోరులో 2-0 గోల్స్ తేడాతో విజయ దుందుభి మోగించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం నెయ్‌మార్ 51 నిమిషంలో,ఫర్మినో 88వ నిమిషంలో గోల్స్ కొట్టి జట్టు విజయానికి పూల పాన్పు వేశారు. మొదటి హాఫ్‌లో హోరా హోరిగా పోరాటం అనేది జరిగినప్పటికీ... బ్రేక్ తర్వాత బ్రెజిల్ దూసుకువెళ్లింది.
రెండు ప్రధానమైన గోల్స్ కొట్టి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. అయితే సాధ్యమైనంత వరకు మెక్సికో ఆటగాళ్లు కూడా బ్రెజిల్ సహనాన్ని పరీక్షించడానికి యత్నించారు. కానీ ఆ జట్టు ఐకమత్యం ముందు మెక్సికో గోల్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా కార్యరూపం దాల్చలేదు. స్టార్ జట్టుగా బరిలోకి దిగిన బ్రెజిల్ ఇప్పటి వరకు 5 సార్లు ప్రపంచ కప్ గెలుచుకుంది.