Pele Passes Away: పీలే రాకతో కిక్కిరిసిపోయిన కోల్‌కతా నగరం.. పులకరించిన ఈడెన్ గార్డెన్స్
Pele In Eden Gardens: లెజెండరీ ఆటగాడు పీలే తుదిశ్వాస వీడడంతో ఫుట్‌బాల్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ దిగ్గజ ఆటగాడు భారత్‌లోనూ ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు.
Pele In Eden Gardens: ఫుట్‌బాల్ ప్రపంచ మాంత్రికుడు పీలే (82) కన్నుమూశారు. మూడు ప్రపంచకప్‌లు గెలిచి రికార్డు సృష్టించిన పీలే గురువారం రాత్రి తుది శ్వాస విడిచాడు. ఈ లెజెండీ ప్లేయర్ 45 ఏళ్ల క్రితం కలకత్తా గడ్డపై అడుగుపెట్టాడు. పీలే రాగానే పెట్టగానే నగరమంతా స్తంభించిపోయింది. ఆయనను చూసేందుకు దాదాపు 40 వేల మంది విమానాశ్రయానికి చేరుకున్నారు.
న్యూయార్క్ కాస్మోస్ జట్టు తరుఫున ఆడేందుకు పీలే భారత్‌కు వచ్చారు. ఈడెన్ గార్డెన్స్‌లో భారత దిగ్గజ ఆటగాడు మోహన్ బగాన్ జట్టుతో స్నేహపూర్వక మ్యాచ్‌లో ఆడాడు. ఈ లెజెండరీ ప్లేయర్ రాకతో ఈడెన్ గార్డెన్ కిక్కిరిసిపోయింది. దాదాపు 80 వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి విచ్చేశారు. మైదానం నలువైపులా పీలే పేరు మారుమోగిపోయింది.
రాత్రిపూట వర్షం కురిసినా.. పీలే కోసం అభిమానుల అభిమానులు అలానే ఎదురుచూశారు. మోహన్ బగాన్ జట్టుతో కేవలం 30 నిమిషాల పాటు ఆడిన ఈ దిగ్గజ ఆటగాడు తన సొగసైన ఫుట్‌వర్క్‌తో ప్రేక్షకులను అలరించారు. మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. మోహన్ బగాన్ టీమ్ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ అత్యుత్తమ ఆటగాడి కనబర్చాడు. ఈ మ్యాచ్ తరువాత పీలే ఒక రోజు మాత్రమే కోల్‌కతాలో ఉన్నారు. ఒక వారం తర్వాత తన కెరీర్‌లో చివరి మ్యాచ్ కూడా ఆడేశారు.
కొన్నేళ్ల తరువాత 2015లో బ్రెజిలియన్ గ్రేట్ మరోసారి భారత్‌కు వచ్చాడు. అయితే ఈసారి జాతీయ స్థాయి ఇంటర్ స్కూల్ పోటీ అయిన సుబ్రోటో కప్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. 2018లో చివరిసారి కోల్‌కతాకు వచ్చారు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి అసలు కారణం ఇదే.. కారు అద్దాలు పగలగొట్టి మరీ..
Also Read: Prabhas on Kriti Sanon: కృతితో రిలేషన్ పై ఓపెన్ అయిపోయిన ప్రభాస్.. అసలు విషయం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి