Chennai Super Kings buy franchise in South Africa T20 league: ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాసుల వర్షం కురిపించే మెగా లీగ్‌లో ఆడేందుకు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు కూడా ఆసక్తి కనబరుస్తారు. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను చూసి ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. అయితే అవేమీ ఐపీఎల్ టోర్నీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌, బిగ్ బాష్ లాంటి టోర్నీలు కాస్త పేరుగాంచాయి. తాజాగా మరో లీగ్‌ వస్తోంది. క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను ఆరంభిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ మొదటి ఎడిషన్ జనవరి 2023లో జరిగే అవకాశం ఉంది. ఈ లీగ్‌లోని మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా బుధవారం తెలిపింది. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యజమానులు జోహన్నెస్‌బర్గ్ జట్టును కొనుగోలు చేశారు. 'జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్' పేరుతో క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కొనసాగే అవకాశం ఉంది. దాంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ లీగ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ జట్టును నడిపించనున్నాడు. ఇది మహీ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. 


ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్‌కేతోనే ఉంటున్నాడు. మహీ చెన్నైకి ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో చెన్నైని సక్సెస్ ఫుల్ ప్రాంచైజీగా తీర్చిదిద్దాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై 2010, 2011, 2018 మరియు 2021 టైటిల్స్ గెలుచుకుంది. 2008, 2012, 2013, 2019 లీగ్‌లలో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు 2010, 2014 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను కూడా గెలుచుకుంది. క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా మాజీ భారత కెప్టెన్ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు అంటున్నారు. 


Also Read: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన పంత్‌.. 25 స్థానాలు ఎగబాకిన హార్దిక్!


Also Read: మెట్రో స్టేషన్‌లో అందమైన యువతి డ్యాన్స్‌.. నిమిషాల్లో వైరల్ అయిన వీడియో!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook