మొదటి నుంచీ నిలకడగా ఆడుతూ విజయ పరంపర సాగించిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆ తర్వాత తడబడుతూ ఆడింది. వరుస ఓటములతో కోలోకోలేని దెబ్బలు తింటూ ఆఖరికి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించాలన్న ఆశ కూడా తీరలేదు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై తరఫున ఆటను ధోని చాలా తెలివిగా ఆడాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంబటి రాయుడు, డుప్లిసెస్ లాంటి ఆటగాళ్లు చాలా తక్కువ స్కోరుకే అవుటైనా, హర్భజన్ (19; 22 బంతుల్లో 2×4, 1×6), దీపక్‌ చాహర్‌ (29; 20 బంతుల్లో 1×4, 3×6)ల అండతో మ్యాచ్‌ను గట్టెక్కించాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన సురేశ్ రైనా కూడా దూకుడుగా ఆడి 61 పరుగులు చేయడంతో చెన్నై విజయబాట పట్టింది. 


తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌లో  కరుణ్‌ నాయర్‌ (54), మనోజ్‌ తివారి (35), డేవిడ్‌ మిల్లర్‌ (24) తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా పెద్దగా రాణించకపోవడంతో 153 పరుగులు స్కోరు మాత్రమే చేయగలిగింది ఆ జట్టు. ఇక ముంబయిలో మంగళవారం జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో చెన్నై, సన్ రైజర్స్ జట్టు తలపడనున్నాయి.