పూణెలో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్
పుణెలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా దుమ్మురేపారు.
పుణెలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా దుమ్మురేపారు. ఈ దూకుడికి కళ్లెం వేయడానికి రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నించినా.. తుదిపోరులో మాత్రం 64 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేయడానికి సిద్ధమైన చెన్నై 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (106; 57 బంతుల్లో 9×4, 6×6) చేసిన సెంచరీ చెన్నై అభిమానులను ఉర్రూత్తలూగించింది.
ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చెన్నై హీరోలు తమదైన శైలిలో రాణించారు. దీపక్ చాహర్‌తో పాటు శార్దూల్, బ్రావో, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు తీయడంతో రాయల్స్ 18.3 ఓవర్లలో140 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. అలాగే తొలి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చెన్నై ఆటగాడు వాట్సన్ కొట్టే సిక్సర్లు, ఫోర్లను అసహాయ స్థితిలో చూడడం తప్ప రాజస్థాన్ ఆటగాళ్లు ఏమి చేయలేకపోయారు. రాయల్స్‌లో శ్రేయస్ గోపాల్(3/20) తప్ప మిగతా బౌలర్లు ఎవ్వరూ కూడా పెద్దగా రాణించలేదు.
ముఖ్యంగా చెప్పుకోవల్సింది చెన్నై బ్యాటింగ్‌లో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా గురించి. వాట్సన్‌తో కలిసి పరుగుల వరదను పారించడంలో ఆయన జట్టుకి ఎంతగానో దోహదపడ్డాడు. అయితే రైనా అవుటైనా..చివరిలో బ్రావో 24(16 బాల్స్) కూడా రాణించడంతో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు చేసి, ప్రత్యర్థికి మంచి సవాలునే విసిరింది