BCCI Chief Selector Chetan Revelas Jasprit Bumrah's Injury Issue: భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా చాలా కాలంగా భారత జట్టులో ఆడం లేదు. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా సెప్టెంబర్ 2022 నుంచి క్రికెట్ ఆడలేదు. ఈ క్రమంలోనే ఆసియా కప్ 2022, టీ20 ప్రపంచకప్ 2022 ఆడలేదు. గాయంతో జాతీయ క్రికెట్ అకాడమీలో టీమిండియా పేస్ గుర్రం పునరావాసం పొందాడు. గత నెలలో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ ​కోసం భారత జట్టులోకి బుమ్రా.. పూర్తి ఫిట్‌నెస్‌ లేని కారణంగా మరలా జట్టుకు దూరమయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జస్ప్రీత్ బుమ్రా గాయంపై జీ మీడియా నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలనం విషయం బయటపెట్టారు. టీ20 ప్రపంచకప్ 2022కి ముందు స్టార్ బౌలర్ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా లేడని, అయినా అతను జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడని తెలిపారు. జాతీయ క్రికెట్ అకాడమీలో పూర్తిగా పునరావాసం పొందలేదన్నారు. టీ20 ప్రపంచకప్ 2022కి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. 'జీ మీడియా' నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్‌లో ఆ సిరీస్ గురించి ఇప్పుడు చేతన్ శర్మ తెలిపారు. 


చేతన్ శర్మ మాట్లాడుతూ, 'అప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడు.  కాబట్టి అతనిని మూడవ మ్యాచ్‌లో ఆడించాలని ప్లాన్ చేశాం.  అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు కెప్టెన్ రోహిత్ శర్మలు మాత్రం రెండవ మ్యాచ్‌లో ఆడించాలనుకున్నారు. ఇక నేను బుమ్రాతో మాట్లాడితే.. మొదటి మ్యాచ్ ఆడతానన్నాడు. సెకండ్ మ్యాచ్ ఆడమని నేను చెప్పాను. సాయంత్రం మమ్మల్ని స్కాన్ కోసం రమ్మని కబురు వచ్చింది. రెండో మ్యాచ్ మధ్యలో సాయంత్రం మళ్లీ స్కాన్ కోసం తీసుకెళ్లబోతున్నామని నాకు సందేశం వచ్చింది' అని చెప్పారు. 


'ఫిట్‌గా లేకుండా ఒకటి రెండు మ్యాచ్‌ల్లో జస్ప్రీత్ బుమ్రాను ఆడిస్తే.. అతను కనీసం ఒక సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తదనుకున్నా. ఇక బుమ్రా గాయం చాలా పెద్దదని తేలింది. అప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని ప్రపంచకప్ 2022 నుంచి తప్పించాలని నిర్ణయించుకుంది' అని చేతన్ శర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరగతున్న మూడో టెస్టులో పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. 


Aslo Read: Chetan Sharma Sting Operation: ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్స్.. టీమిండియా ప్లేయర్స్ సంచలన విషయాలు బయటపెట్టిన చేతన్ శర్మ!  


Aslo Read: iPhone 12 Discounts: ఐఫోన్ 12పై డిస్కౌంట్ల వర్షం.. భారీ తగ్గింపు చూసి ఎగబడి కొంటున్న జనం!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.