BCCI Chief Selector Chetan Sharma makes Shocking Comments on Team India players: 'జీ మీడియా' నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన విషయాలు బయటపెట్టారు. భారత ఆటగాళ్ల ఇంజెక్షన్ల వాడకం, డోప్ టెస్ట్, ఫిట్‌నెస్ టెస్ట్, సౌరవ్ గంగూలీ-విరాట్ కోహ్లీ వివాదం, జస్ప్రీత్ బుమ్రా గాయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మ్యాచ్‌కి ముందు పూర్తి ఫిట్‌నెస్ కోసం భారత ప్లేయర్స్ ఇంజెక్షన్స్ (Injections) తీసుకుంటున్నారని చేతన్ శర్మ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంజెక్షన్ల సాయంతో (Fake Injections) అన్ ఫిట్ ప్లేయర్లు కూడా ఫిట్‌గా మారుతున్నారని చేతన్ శర్మ పేర్కొన్నారు. జీ మీడియా రహస్య కెమెరాలో చేతన్ శర్మ మాట్లాడుతూ... 'భారత క్రికెటర్లు పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోతే.. మ్యాచ్‌కి ముందు ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. ఇంజెక్షన్ల సాయంతో అన్ ఫిట్ ఆటగాళ్లు కూడా ఫిట్‌గా మారుతున్నారు. సరైన ఫిట్‌నెస్ లేని క్రికెటర్ కూడా భారత జట్టులో కొనసాగేందుకు ఇంజెక్షన్లు తీసుకుని 100 శాతం ఫిట్‌నెస్‌ని నిరూపించుకుంటున్నాడు. ఏ ఇంజెక్షన్ తీసుకుంటే డోపింగ్ టెస్టులో దొరికిపో, ఏ ఇంజెక్షన్ దొరకదో టీమిండియా ఆటగాళ్లకు బాగా తెలుసు' అని అన్నారు. 


'ఫేక్ ఫిట్‌నెస్ గేమ్‌లో పెద్ద క్రికెట్ సూపర్‌స్టార్లు కూడా ఉన్నారు. ఓ స్టార్ ప్లేయర్ అయితే కనీసం కిందకి వంగలేని పరిస్థితులో ఉన్నాడు. మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ప్రైవేట్‌గా ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిట్‌నెస్‌ సాధించి డోప్‌ టెస్టులో కూడా చిక్కుకోని ఇంజక్షన్‌ని భారత ఆటగాళ్లు ఉపయోగిస్తున్నారు. సైలెంట్‌గా వెళ్లి ఇంజెక్షన్లు తీసుకుంటే.. మేం ఫిట్‌గా ఉన్నామని సర్టిఫికెట్ ఇస్తాం. ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగేందుకు భారత ఆటగాళ్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. క్రీడా ప్రపంచంలో ఇది మోసంగా పరిగణించబడుతుంది' అని చేతన్ శర్మ అన్నారు. 


Also Read: iPhone 12 Discounts: ఐఫోన్ 12పై డిస్కౌంట్ల వర్షం.. భారీ తగ్గింపు చూసి ఎగబడి కొంటున్న జనం!  


Also Read: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్ట్.. చెతేశ్వర్ పుజారా ముందు అరుదైన మైలురాయి!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.