Cheteshwar Pujara 100 Test: భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్ట్.. చెతేశ్వర్ పుజారా ముందు అరుదైన మైలురాయి!
IND vs AUS 2nd Test, Cheteshwar Pujara to play 100th Test Match in Delhi. ఢిల్లీ టెస్ట్ సందర్భంగా 100 టెస్టులు ఆడిన 13వ భారత క్రికెటర్‌గా చెతేశ్వర్ పుజారా రికార్డుల్లో నిలుస్తాడు.
Cheteshwar Pujara to play 100th Test Match in Delhi: భారత గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 జరుగుతోన్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. ఇక రెండో టెస్ట్ ఢిల్లీ వేదికగా 2023 ఫిబ్రవరి 17 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయిని అందుకోనున్నాడు. పుజారా తన కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు.
ఢిల్లీ టెస్ట్ (IND vs AUS 2nd Test) సందర్భంగా మైదానంలోకి అడుగుపెట్టగానే.. 100 టెస్టులు ఆడిన 13వ భారత క్రికెటర్‌గా చెతేశ్వర్ పుజారా రికార్డుల్లో నిలుస్తాడు. ప్రస్తుత భారత టెస్టు జట్టులో 100 టెస్టులు ఆడిన రెండో క్రికెటర్‌గా పుజారా నిలవనున్నాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. 2022 మార్చిలో శ్రీలంకపై తన 100వ టెస్టు ఆడాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు ఆడి ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (163), హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (134 టెస్టులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
100 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన భారతీయుల జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (132), మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (131), లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ (125), మాజీ ప్లేయర్ దిలీప్ వెంగసర్కార్ (116), మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (113), మాజీ సారథి విరాట్ కోహ్లీ (105), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), వీరేందర్ సెహ్వాగ్ (103) ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో ఇప్పటివరకు ఆర్ అశ్విన్ 89 టెస్టులు ఆడగా.. రవీంద్ర జడేజా, మొహ్మద్ షమీలు చెరో 61 టెస్టులు ఆడారు.
చెతేశ్వర్ పుజారా 2010లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. పుజారా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 104 మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో 99 టెస్టులు, ఐదు వన్డేలు ఉన్నాయి. పుజారా టెస్ట్ మ్యాచుల్లో 44.15 సగటుతో 7021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐదు వన్డేలలో 51 రన్స్ మాత్రమే బాదాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.