టీమిండియా ఆరెంజ్ జెర్సీ వివాదం; నేతల మధ్య మాటల యుద్ధం
టీమిండియా ఆరెంజ్ జెర్సీలు వివాదం ఇంకా కొసాగుతోంది.
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా టీమిండియాకు సరికొత్త ఆంరెజ్ జెర్సీ కేటాయించిన విషయం తెలిసిందే. టీమిండియాకు ఆరెంజ్ జెర్సీ కేటాయించినప్పటి నుంచి నీలి రంగుంలో ఉండాల్సిన టీమిండియాకు కాషాయం రంగు కేటాయించడం ఏంటని కాంగ్రెస్, ఎస్పీ లాంటి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కమలనాధులు ప్రకటనలు ఇచ్చారు.
మెహబూబా ముఫ్తీ సైటైర్
కాగా తాజాగా ఇంగ్లాండ్ తో టీమిండియా మ్యాచ్ ముగియడం.. ఆరెంజ్ జెర్సీలో బరిలోకి దిగిన కోహ్లీసేన వరల్డ్ టోర్నీలో తొలి ఓటమిని చవిచూడటంతో ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారింది. టీమిండియా ఓటమిపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ కాషాయ రంగు జెర్సీ కోహ్లీసేనకు కలిసిరాలేదని ...దీనికి కారణంగానే టీమిండియా ఓడిపోయిందని సెటైర్ వేశారు.
ముఫ్తీ వ్యాఖ్యలకు శివసేన కౌంటర్
మొహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై శివసేన వర్గాలు మండిపడ్డాయి. ఈ కామెంట్స్ ను శివసేన పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా ఖండించారు. మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమన్నారు ... టీమిండియా ఓటమికి జెర్సీనే కారణమంటూ వ్యాఖ్యలు చేస్తున్న ముఫ్తీని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ ఘాటైన విమర్శ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలే నిజమైతే... మరి పాకిస్తాన్ జట్టు తమ సొంత గ్రీన్ కలర్ జెర్సీ ధరించి కూడా ఓడిపోయింది కదా...మరి దీన్ని ఎలా భావించాలి ? దీనిపై మొహబూబా ముఫ్తీ స్పందన ఏంటి అని రౌత్ ప్రశ్నించారు.