సౌతాఫ్రికాతో మూడో టెస్టులో ఉద్దేశపూర్వకంగా బాల్ ట్యాంపరింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఆసీస్ క్రికెట్ బోర్డు మండిపడింది. చేసింది చెడ్డపని అయినా అది జట్టు సమిష్టి నిర్ణయమని బాహాటంగా చెప్పిన స్మిత్, ప్రధాన నిందితుడు బెన్ క్రాప్ట్‌లను చూసి క్రికెట్ అభిమానులు నివ్వెరపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వారిద్దరిపై వేటుకు రంగం సిద్దమైందని.. విచారణ ముగిశాక వెంటనే నిర్ణయం వెలువడుతుందని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తమ ఆటగాడు కేమరాన్ బెన్ క్రాప్ట్‌పై వచ్చిన బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. 'మేము ఉద్దేశ పూర్వకంగా బంతిని రుద్దలేదు. ఈ విషయంపై మేము ఐసీసీకి వివరణ ఇచ్చాం. నా కెప్టెన్సీలో మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవు' అని పేర్కొన్నాడు.  బెన్ క్రాప్ట్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే అతడి ఖాతాలో నాలుగు డీ మెరిట్ పాయింట్లు చేరుతాయి.


కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ ఓపెనర్ కేమరాన్ బెన్‌‌క్రాప్ట్‌ బాల్‌ ట్యాంపరింగ్‌‌కు యత్నించాడని ఫీల్డ్‌ అంపైర్లకు ఫిర్యాదు చేశారు. అయితే ప్యాంట్‌లో పసుపు రంగు వస్తువును దాచడం కెమెరాల్లో స్పష్టం అయింది. అంపైర్లు అతన్ని పిలిచి వివరణ కోరగా ఏమి లేదని..అది బంతిని తుడిచే నల్లటి వస్త్రం అని చూపించాడు. దీనికి సంతృప్తి చెందిన అంపైర్లు ఆటను కొనసాగించారు. అయితే తొలుత కెమెరాల్లో కనిపించిన వస్తువు.. తీరా అంపైర్ల చూపించినది వేరు కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్ జరిగిందేమో అని ఆరోపించారు.