Rishabh Pant: రిషబ్ పంత్ బాడీ మసాజ్ వీడియో వైరల్.. ఆడుకుంటున్న నెటిజన్లు
Rishabh Pant Body Massage Video: రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 10 పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్‌కు సంబంధించి మసాజ్ వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు.
Rishabh Pant Body Massage Video: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరుస వైఫల్యం కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో పంత్ 10 పరుగులకే ఔట్ అయ్యాడు. అయితే తక్కువ స్కోరుకే డగౌట్‌కు చేరుకున్న పంత్.. డగౌట్‌లో బాడీ మసాజ్ చేయించుకుంటూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ పంత్‌ను అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. రిషబ్ పంత్ మసాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో కెమెరా ఫోకస్ రిషబ్ పంత్ వైపు వెళ్లింది. డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్ చేయించుకుంటూ కనిపించాడు. పంత్‌కు వెన్ను సమస్య ఉందని.. అందుకే డ్రెస్సింగ్ రూమ్‌లో మసాజ్ చేస్తుంచుకున్నట్లు తెలుస్తోంది. పంత్ గాయానికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. న్యూజిలాండ్ టూర్ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో పంత్ ఆడనున్నాడు.
మూడో వన్డేలో రిషబ్ పంత్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు అభిమానులు. కానీ కేవలం 10 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్ మూడో బంతికి చెత్త షాట్ ఆడి అవుటయ్యాడు. డారిల్ మిచెల్ వేసిన బంతికి గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చాడు. పంత్ వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇవ్వడంతపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దానికి తోడు పెవిలియన్‌కు వెళ్లి వెంటనే మసాజ్ చేయించుకోవడంతో భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పంత్.. అలసిపోయిన మసాజ్ చేయించుకున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌట్ అయింది. సిరీస్‌ను సమం చేయాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. శ్రేయస్ అయ్యర్ (49), వాషింగ్టన్ సుందర్ (51) మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో మిల్నే, మిచెల్ తలో మూడు వికెట్లు తీయగా.. సౌథీ 2, ఫెర్గ్యూసన్, శాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18 ఓవర్లలో 104 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. వర్షం కురుస్తుండడంతో ఇన్నింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. ఫిన్ అలెన్ (57) పరుగులు చేయగా.. కాన్వే (38), విలియమ్సన్ క్రీజ్‌లో ఉన్నారు.
Also Read: China-America: భారత్‌తో సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్
Also Read: Minister Roja: వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సున్నా.. పవన్ ఓడిపోతే అదే చేయాలి.. మంత్రి రోజా సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook