ENG vs NZ highlights: సెంచరీల మోత మోగించిన కాన్వే, రచిన్.. ఇంగ్లండ్‌పై కివీస్ ఘన విజయం..
England vs New Zealand: వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను కసి తీరా కొట్టింది కివీస్.
ENG vs NZ Match Highlights: వన్డే వరల్డ్‌కప్ ఆరంభ పోరులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను కసి తీరా కొట్టింది కివీస్. గత వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు డెవిన్ కాన్వే (140), రచిన్ రవీంద్ర (117 ) సెంచరీల మోత మోగించడంతో ఇంగ్లండ్ ను 9 వికెట్లతో న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది ఇంగ్లండ్. భారీ షాట్లకు పోయి వికెట్లు సమర్పించుకున్నారు ఇంగ్లీష్ బ్యాటర్లు. ఆ జట్టు ఆటగాళ్లలో జో రూట్ హాఫ్ సెంచరీ సాధించగా.. బట్లర్ (43), బెయిర్‌స్టో (33) పర్వాలేదనిపించారు. మలన్ (14), బ్రూక్ (25), అలీ (11), లివింగ్‌స్టోన్ (20) తక్కువ స్కోర్లుకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లను తట్టుకుని జో రూట్ ( 77) ఒక్కడే నిలిచాడు. క్రిస్ ఓక్స్ ( 11), సామ్ కర్రన్ (14) కూడా స్వల్ప స్కోర్లుకే వెనుదిరిగారు. దీంతో ఇంగ్లండ్ టీమ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, గ్లెన్ ఫిలిప్స్ 2, మిచెల్ శాంటర్న్ 2, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.
లక్ష్యచేధనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యంగ్ డకౌట్ అయ్యాడు. అయితే కాన్వేతో కలిసి రవీంద్ర ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ ప్రపంచ కప్ లో కాన్వే తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రచిన్ కూడా శతకాన్ని సాధించాడు. వన్డేల్లో అతనికిదే తొలి సెంచరీ. వీరిద్దరూ రెండో వికెట్ కు 211 బంతుల్లోనే 273 పరుగులు జోడించారు. మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే కివీస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. కాన్వే 121 బంతుల్లోనే 19 ఫోర్లు, 3 సిక్స్ లతో 152 పరుగులు, రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ లతో 123 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
Also Read: World Cup 2023: ఏ వరల్డ్ కప్ కి ఇలా జరిగిఉండదేమో.. బోసిపోయిన నరేంద్ర మోదీ స్టేడియం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook