Ind vs NZ Live Score: 5 వికెట్లతో చెలరేగిన షమీ... టీమిండియా ముందు మోస్తరు టార్గెట్..
Ind vs NZ Live Score: ధర్శశాల వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు.
Cricket World Cup 2023, Ind vs NZ Live Score: వన్డే ప్రపంచకప్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక పోరు జరుగుతోంది. దర్శశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిసి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డెరిల్ మిచెల్ 130 సెంచరీతో చెలరేగాడు. ఇతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. రచిన్ రవీంద్ర కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మినహా మిగతా ప్లేయర్లు అందరూ చేతులెత్తేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బ్లాక్ క్యాప్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కాన్వే డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విల్ యంగ్ కేవలం 17 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం రచిన్ రవీందర్ కు జత కలిసిన మిచెల్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పుటికీ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ.. మూడో వికెట్ 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
పేసర్లను సమర్థవంతంగా ఆడలేకపోయిన కివీస్ బ్యాటర్లు స్పినర్లను లక్ష్యంగా చేసుకుని పరుగులు రాబట్టారు. ముఖ్యంగా కులదీప్ బౌలింగ్ లో బ్యాట్ ఝలిపించారు. ఈ క్రమంలో రచిన హాఫ్ సెంచరీ చేసి ఔటవ్వగా.. మిచెల్ మాత్రం సెంచరీ మార్కును దాటాడు. టెయిలెండర్లు సహాయంతో సింగిల్స్ జోడిస్తూ స్కోరు బోర్డును 250 పరుగులు దాటించాడు మిచెల్. ఇతడు తొమ్మిదో వికెట్ గా వెనుదిరిగాడు. ఫిలిఫ్స్ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.