ODI World Cup 2023, NZ vs BAN: వన్డే వరల్డ్ కప్-2023లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‍లో కివీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందింది.  తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (66) హాఫ్ సెంచరీ చేయగా.. మహమ్మదుల్లా (41 నాటౌట్), షకీబల్ హసన్ (40) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫెర్గ్యూసన్ మూడు, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన కివీస్ 42.5 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి 248 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (89 నాటౌట్), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (78 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన విలియమ్సన్ అదరగొట్టాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్, షకీబల్ హసన్ చెరో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ 43 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. వరల్డ్ కప్‍లో భాగంగా రేపు (అక్టోబర్ 14) ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి.


Also Read: 2028 Los Angeles Olympics: గుడ్ న్యూస్ .. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్‌.. 128 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.