Rohit Sharma visits Tirumala Temple : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కలియుగ దైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ(Rohit Sharma) కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రోహిత్ శర్మకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రోహిత్ శర్మను వేద పండితులు ఆశీర్వదించారు. తర్వాత ఆలయ అధికారులు రోహిత్ ను సత్కరించి ప్రసాదాలను అందించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. త్వరలో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం రోహిత్ తిరుమలకు వచ్చి ఉంటాడని టాక్ వినిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 ప్రపంచ కప్ కు ముందు కూడా రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆ సంవత్సరం వరల్డ్ కప్‌లో రోహిత్ బ్యాట్‌తో అదరగొట్టాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 648 పరుగులు చేశాడు. ఆగస్టు 30 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో రోహిత్..జట్టుతో కలవనున్నాడు. ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తమ టీమ్స్ ను ప్రకటించాయి. అయితే టీమిండియా మాత్రం తుది జట్టును ఇంకా ప్రకటించలేదు.మరో రెండు రోజుల్లో ఫైనల్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు సన్నాహకంగా ఆసియా కప్‌ను ఉపయోగించుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఆసియా కప్‌కు ఆడే టీమ్ నే దాదాపు ప్రంపచకప్ కు ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. 


Also Read: World Cup 2023: టీమిండియాను వెంటాడుతున్న ఆ భయం.. నాలుగోస్థానంలో ఆడేదెవరు..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి