Shoaib Malik Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్
Shoaib Malik Marriage: భారత టెన్నీస్ దిగ్గజం సానియా మీర్జా ఊహించని షాక్ తగిలింది. తన భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా సానియా మీర్జాతో విబేధాలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతున్న సమయంలోనే అతడు ఈ వివాహం చేసుకోవడం కలకలం రేపింది. సానియాతో తెగతెంపులు చేసుకున్నాడని.. అధికారికంగా విడిపోయిన తర్వాతనే ఈ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
Shoaib cuts relation with Sania: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్ నటిని పెళ్లి చేసుకుని ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. షోయబ్‌కు ఇది మూడో వివాహం కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా తన వివాహ ఫొటోలను పంచుకుంటూ 'మా బంధాన్ని ఏర్పాటుచేసుకున్నాం' అని షోయబ్ పోస్టు చేశాడు. ఆమె పెళ్లి చేసుకున్నది ఎవరో కాదు పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టీవీ నటి, మోడల్ సనా జావెద్.
షోయబ్ మొదటి వివాహం అయేషా సిద్ధిఖీని చేసుకోగా.. రెండో పెళ్లి 2010లో సానియా మీర్జాను చేసుకున్నాడు. ఈ పెళ్లితో షోయబ్‌కు, సానియా మధ్య ఎలాంటి బంధం లేదని తేలిపోయింది. వీరిద్దరూ అధికారికంగా విడిపోయారనే ప్రచారం జరుగుతోంది. సానియాతో తెగదెంపులు చేసుకున్న తర్వాతనే షోయబ్ ఈ వివాహం చేసుకున్నాడని సమాచారం. సనాకు ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విడిపోయిన ఆమె షోయబ్ కు దగ్గరైంది.
కొన్ని నెలలుగా షోయబ్, సానియా వ్యక్తిగత జీవితంలో చాలా పరిణామాలు జరిగాయని వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిసింది. ఇటీవల షోయబ్ తన ప్రొఫైల్‌లో బయోలు మార్చుకోవడం.. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ రీల్ స్టోరీలో సానియా 'కష్టం' అనే సందేశం పంచుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్నిరోజులకే షోయబ్ మరో వివావాం చేసుకున్నాడు. టెన్నీస్ ఆటలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న సానియా వ్యక్తిగత జీవితంలో పదిహేన్నేళ్లు కూడా వివాహ బంధం నిలబడలేదు. వారి 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పడినట్టు తెలుస్తోంది.
పద్నాలుగేళ్ల బంధం
షోయబ్‌ను 12 ఏప్రిల్ 2010లో సానియా మీర్జా వివాహం చేసుకుంది. హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత దాదాపు పదేళ్లు వీరు ఎంతో ప్రేమగా.. ఆనందంగా గడిపారు. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు. వీరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయని చర్చ నడుస్తోంది. ఇటీవల ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. బాబు మాత్రం షోయబ్ వద్ద ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.
Also Read: Sania Mirza Divorce News: సానియా మీర్జా విడాకులు తీసుకుందా..? ఇన్‌స్టా పోస్టు అర్థం అదేనా..?
Also Read: Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter