CSK captain MS Dhoni to play IPL 2023 also says Sunil Gavaskar: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 20213 ఛాంపియన్ ట్రోఫీలు అందించి.. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత అందించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచారు. ఐపీఎల్ 2020 ముందు అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిమా ధోనీ.. అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. అయితే మహీ ఐపీఎల్ ఆడుతుండడంతో ఫాన్స్ అతడి ఆటను ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2020 అనంతరం మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకున్నా.. అది జరగలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడటంతో ఐపీఎల్ 2022లో ధోనీసేన ప్లే ఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022 అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెగా లీగ్ నుంచి తప్పుకుంటారని (రిటైర్మెంట్) వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం, కామెంటేటర్ సునీల్‌ గవాస్కర్ స్పందించారు. ధోనీకి ఇంకా క్రికెట్‌ ఆడాలనే ఆశ ఉందని, ఐపీఎల్ 2022లో అతడు ఆడిన విధానమేనని అందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.  


తాజాగా సునీల్‌ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2022లో ఎంఎస్ ధోనీ ఆడిన విధానం ఓసారి చూస్తే.. అతడికి ఇంకా క్రికెట్ ఆడాలనే ఇష్టం ఉన్నట్లు అర్ధమవుతోంది. వికెట్ల మధ్య అతడు పరుగెడుతున్న విధానం అద్భుతం. సునాయాసంగా రన్స్ తీస్తున్నాడు. మ్యాచ్ ప్రత్యర్థికి అంత త్వరగా అప్పగించడు. ఇటీవల చెన్నై ఆడేటప్పుడు రెండు, మూడు వికెట్లు పడగానే.. అతడికి ఆడే అవకాశం వచ్చిందనే విషయాన్ని గుర్తించాడు. పలు సందర్భాల్లో మనం ఈ విషయాన్ని గమనించాం' అని చెప్పారు. 


'వీటన్నింటిని బట్టి చూస్తే ఎంఎస్ ధోనీ వచ్చే ఏడాది కూడా ఆడతాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి మ్యాచ్‌ తర్వాత.. ధోనీ టీ20 లీగ్‌కు వీడ్కోలు పలుకుతాడా అని అడిగినప్పుడు కూడా కచ్చితంగా కాదనే సమాధానం చెప్పాడు' అని సునీల్‌ గవాస్కర్ అన్నారు. ఇటీవల ఐపీఎల్ 2022లో తొలిసారి కెప్టెన్సీ చేసినప్పుడు కూడా వచ్చే ఏడాది చెన్నై జట్టులో ఆడతారా లేదా అనే ప్రశ్న తలెత్తింది. కచ్చితంగా మీరు నన్ను పసుపు రంగు జెర్సీలో చూస్తారని.. అది ఆటగాడిగానా లేక ఇతర పాత్రలోనా అనేది వేరే విషయం అని ధోనీ బదులిచ్చాడు. ఈ సీజన్ తర్వాత మహీ ఆటగాడిగా తప్పుకుని కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 


Also Read: Kangana Ranaut: మహేశ్‌ బాబు చెప్పింది నిజమే.. కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు: కంగనా రనౌత్


Also Read: Ben Stokes Falls: క్రీజులోనే కుప్పకూలిన బెన్ స్టోక్స్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook