ఐపీఎల్ 2020 ( IPL 2020 ) పాయింట్స్ టేబుల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) అట్టడుగున ఉంది. అయితే టీమ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం తము మళ్లీ పికప్ అవుతాము అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆరు రోజుల గ్యాప్ దొరికింది కాబట్టి ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నాం అని అన్నారు. ఐపీఎల్ లో మళ్లీ మంచి ప్రదర్శన చూపించి రాణిస్తామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ |  Kane Williamson Memes: కేన్ విలియమ్సన్ పై ట్రెండ్ అవుతున్న మేమ్స్


ఐపీఎల్ 2020ని మంచి విజయంతో ప్రారంభించిన చెన్నై ఆ తరువాత వరుసగా రెండు గేమ్స్ లో ఓడిపోయింది. దీంతో చెన్నై టీమ్ పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీనిపై స్పందించిన కోచ్ ఫ్లెమింగ్ మొదటి మూడు గేమ్స్ మధ్య ఎక్కువ గ్యాప్ లేదు అని.. అది కూడా వేరే వేరే గ్రౌండ్స్ అవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడిన విషయం వాస్తవమే అని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆటగాళ్లు ఆడటం అనేది గొప్ప విషయం అన్నారు. అయితే గ్యాప్ దొరకడంతో మేము గేమ్ ను మళ్లీ ప్లాన్ చేసుకునే అవకాశం లభించింది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో జరగనున్న మ్యాచులో చక్కని ఆటతీరును చెన్నై టీమ్ నుంచి ఆశించవచ్చు అని చెప్పారు.



ALSO READ| What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?


నేటి మ్యాచుకు బ్రావో ( Bravo ), రాయుడు ( Ambati Rayudu ) ఇద్దరు అందుబాటులో ఉండే అవకాశం ఉండటం చెన్నై టీమ్ కు అనుకూలము అయ్యే అవకాశం ఉంది. తొలి మ్యాచులో ముంబైపై చక్కని ప్రదర్శన చూపిన రాయుడు ఆ తరువాత హ్యామ్ స్ట్రింగ్ గాయంతో రెస్ట్ తీసుకున్నాడు. ఇక గాయం కారణంగా బ్రావో ఇప్పటి వరకు ఒక గేమ్ కూడా ఆడలేదు. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఐపీఎల్ 2020 నుంచి వైదొలగడం, తరువాత కీలక ఆటగాళ్ల గాయాల వల్ల చెన్నై టీమ్ ఊహించలేని విధంగా ఇబ్బందులు పడుతోంది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR