IPL 2024 Updates: చెన్నై జట్టుకు ఊహించని షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం..
IPL 2024 Updates: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై జట్టుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ జట్టు కీలక పేసర్ మతీషా పతిరానా గాయంతో దూరమయ్యాడు. దీంతో అతడు ఈ సీజన్ లో ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IPL 2024-CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి వారం రోజులు కూడా సమయం లేదు. ఈలోపే షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి ధోని సేనకు. తాజాగా ఆ జట్టు కీలక పేసర్ గాయంతో దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ 17వ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మ్యాచ్ తోనే మెుదలవ్వబోతుంది. తొలి మ్యాచులో సీఎస్కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను ఢీకొనబోతుంది. మార్చి 22న ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది.
మార్చి 6న సిల్హెట్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో చెన్నై స్టార్ పేసర్ మతీషా పతిరానా గాయపడ్డాడు. అతడు కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టే అవకాశం ఉండటంతో అతడు ప్రారంభ మ్యాచులకు దూరం కానున్నాడు. గత ఐపీఎల్ లో చెన్నై కప్ గెలవడంలో పతిరానా కీ రోల్ ప్లే చేశాడు. అతడు 12 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసి జట్టు విజయాల్లో మంచి పాత్ర పోషించాడు. అయితే అతడు ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉంటాడా లేదనేది ఇప్పడే చెప్పడం కష్టమని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే బొటనవేలు శస్త్రచికిత్స ఐపీఎల్ తొలి దశ మ్యాచులకు దూరమయయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20 సందర్భంగా అతడి వేలికి గాయమైంది.
సీఎస్కే జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానా, అజింక్యా రహానే, సిమ్‌చెర్లెల్లత్, షేక్ రషెద్నెర్, షేక్ రాషేద్నెర్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి.
Also Read: Delhi Capitals: ఢిల్లీకి మరో బిగ్ షాక్.. స్టార్ పేసర్ దూరం.. కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి