CSK vs PBKS Playing 11 is Out: Chris Jordan comes in place of Tushar Deshpande: ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌ జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై తుది జట్టులో ఒక మార్పు చేసింది. తుషార్ దేశ్ పాండే స్థానంలో క్రిస్ జోర్డాన్ వచ్చాడు. మరోవైపు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ రెండు మార్పులు చేసినట్టు చెప్పాడు. హర్‌ప్రీత్ బ్రార్, రాజ్ బావల స్థానంలో జితేష్ శర్మ, వైభవ్ అరోరాలకు పంజాబ్ చోటు కల్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో చెన్నై ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దాంతో ఈరోజటి మ్యాచ్ జడేజా సేనకు కీలకం. విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ దిశగా సాగొచ్చు. మరోవైపు పంజాబ్‌ ఇప్పటివరకు ఒక ఓటమి, ఒక విజయం సాధించింది. పంజాబ్ కూడా విజయంపైనే కన్నేసింది. ఇక ఐ[ఐపీఎల్ టోర్నీలో రెండు జట్ల గణాంకాలను పరిశీలిస్తే.. చెన్నైదే పైచేయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 26 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెన్నై 16, పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.



తుది జట్లు: 
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌ ), శిఖర్ ధావన్, భానుక రాజపక్సే (వికెట్‌ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, షారుక్ ఖాన్, జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, రాహుల్ చహర్, వైభవ్ అరోరా. 
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంఎస్ ధోనీ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి. 


Also Read: Alyssa Healy: అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య! ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ టోర్నీ అవార్డులు అందుకున్న భార్యభర్తలు వీరే!


Also Read: Hyderabad Drugs Case: ఆ పబ్‌తో నా కూతురికి సంబంధం లేదు... రేణుకా చౌదరి రియాక్షన్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook