IPL 2021 Final Result: నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ధోనీ సేన
IPL 2021 Final: ఐపీఎల్-2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌ని 27 పరుగుల తేడాతో ఓడించింది.
IPL 2021 Final Result: ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఛాంపియన్ గా నిలిచింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా(Kolkata Knight Riders).. చెన్నై బౌలర్ల ధాటికి 165 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(51), వెంకటేశ్ అయ్యర్(50) హాఫ్‌సెంచరీలు వృథా అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ధోనీ సేన గెలుపొందడం సహా నాలుగో సారి ట్రోఫీ(CSK win 4th IPL title)ని గెలుచుకుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై బ్యాటర్లు చెలరేగారు. సీఎస్‌కే ఓపెనర్ డుప్లెసిస్ (86) సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే(CSK) నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్‌కు 193 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్(32) జంట తొలి వికెట్‌కు(61 పరుగులు) శుభారంభం అందించారు.
రుతురాజ్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాబిన్ ఉతప్ప(31) ధాటికి ఆడాడు. ఈ క్రమంలో షాట్‌కు యత్నించి నరైన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఓ ఎండ్‌లో డుప్లెసిస్(du Plessis) అర్ధశతకం సాధించి ఫాస్ట్‌గా ఆడగా.. మరోవైపు మొయిన్ అలీ (34) బీభత్సం సృష్టించాడు. అయితే ఇన్నింగ్స్ చివరి బంతికి డుప్లెసిస్ ఔటయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్(Sunil Narine) రెండు వికెట్లు, శివమ్ మావి ఒక వికెట్ పడగొట్టారు. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి