కామన్వెల్త్లో మరో అద్భుతం: స్వర్ణం సాధించిన భారత బ్యాడ్మింటన్ టీమ్
కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి బంగారు పతకాల పంట బాగానే పండుతోంది. తాజాగా భారత బ్యాడ్మింటన్ జట్టు టీమ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది.
కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి బంగారు పతకాల పంట బాగానే పండుతోంది. తాజాగా భారత బ్యాడ్మింటన్ జట్టు టీమ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో మలేషియాతో జరిగిన ఆసక్తికరమైన పోరులో 3-1 స్కోరుతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది భారత బ్యాడ్మింటన్ జట్టు. టీమ్ ఈవెంట్‌కు సంబంధించి సింగిల్స్ పోరులో కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ మరపురాని విజయాలు నమోదు చేశారు.
ప్రపంచ మాజీ నంబర్ వన్ ఛాంపియన్ లీ చాంగ్ వీని శ్రీకాంత్ ఈ పోటీల్లో ఓడించడం విశేషం. ఒక్క పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో మాత్రమే మలేషియా జట్టు భారత్‌పై గెలిచింది. కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం దక్కడం భారతదేశానికి ఇదే మొదటిసారి. ఈ పతకంతో ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 10 స్వర్ణ పతకాలు చేరాయి.