Dale Steyn: దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్, అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల డేల్ స్టెయిన్, ఈ తరంలో గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన స్టెయిన్, తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు(retirement)  పలుకుతున్నట్లు తెలిపాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డేల్ స్టెయిన్(Dale Steyn).. తన కెరీర్‌లో 93 టెస్టులు ఆడి 439 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 26 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు, ఐదు సార్లు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టాడు. 125 వన్డేలు ఆడిన డేల్ స్టెయిన్, 196 వికెట్లు పడగొట్టాడు. 47 టీ20 మ్యాచుల్లో 64 వికెట్లు తీశాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 699 వికెట్లు తీసిన డేల్ స్టెయిన్, 700 వికెట్ల క్లబ్‌లో చేరడానికి ఒక్క వికెట్ దూరంలో క్రికెట్‌(Cricket)కి వీడ్కోలు పలికాడు.


Also Read: Vasoo Paranjape: ప్రముఖ క్రికెట్ కోచ్ వాసు పరంజపే కన్నుమూత..పలువురు సంతాపం


ఐపీఎల్(IPL) 2008లో ఆర్‌సీబీ(RCB) తరుపున ఆడిన డేల్ స్టెయిన్, మొదటి మూడు సీజన్లు రాయల్ ఛాలెంజర్స్‌(Royal Challengers)కే ఆడాడు. ఆ తర్వాత డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్‌ జట్లకి ఆడాడు.ఐపీఎల్​లో 95 మ్యాచులు ఆడిన స్టెయిన్​.. 6.91ఎకానమీతో 97 వికెట్లు పడగొట్టాడు. 2005లో డేల్ స్టెయిన్(Dale Steyn) క్రికెట్ ఎంట్రీ  ఇచ్చాడు. 2343 రోజుల పాటు ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌(ICC Test Bowlers Rankings)లో టాప్‌లో నిలిచిన డేల్ స్టెయిన్, నిర్విరామంగా అత్యధిక రోజులు నెం.1 బౌలర్‌గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.



"ట్రైనింగ్, మ్యాచ్​లు, ట్రావెల్, విజయాలు, ఓటములు, గాయాలతో 20 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సమయంలో అద్భుత జ్ఞాపకాలు సంపాదించా. చాలామందికి ధన్యవాదాలు తెలపాలి. ఇక నేను నా కెరీర్​ను ముగిస్తున్నా. అధికారికంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నా. నా ఈ ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు, సహ ఆటగాళ్లు, జర్నలిస్టులు, అభిమానులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు."  -స్టెయిన్, దక్షిణాఫ్రికా క్రికెటర్
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook