Dale Steyn says Australian pitches would suit Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌పై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్‌ ప్రశంసలు కురిపించారు. సూర్య బ్యాటింగ్ చాలా బాగుంటుందని, మైదానం నలుమూలలా షాట్లు ఆడగలడన్నాడు. సూర్య ఆట తీరుకు ఆస్ట్రేలియా పిచ్‌లు సరిగ్గా సరిపోతాయని, ప్రత్యర్ధులు అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెలించుకోక తప్పదు అని స్టెయిన్‌ చెప్పాడు. అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీ ఆసీస్ గడ్డపై ఆరంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్లేయర్స్.. అక్కడ ప్రాక్టీస్ మొదలెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా డేల్ స్టెయిన్‌ మాట్లాడుతూ... 'బంతి పేస్‌ను అర్ధం చేసుకొని సూర్యకుమార్‌ యాదవ్ బ్యాటింగ్‌ చేస్తాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌, మెల్‌బోర్న్‌ పిచ్‌లు ఇంకా బౌన్సీగా ఉంటాయి. సూర్య లెగ్‌ సైడ్‌ షాట్లను అలవోకగా కొట్టగలడు. నిల్చొని బ్యాక్‌ఫుట్‌ సాయంతో బౌండరీలు బాదగలడు. కవర్‌డ్రైవ్‌లు అద్భుతంగా ఆడతాడు. అందుకే సూర్యని 360 ప్లేయర్ అనొచ్చు. అతడి బ్యాటింగ్ చాలా బాగుంటుంది. ప్రత్యర్ధులు జాగ్రత్తగా ఉండాల్సిందే' అని హెచ్చరించారు. 


'ఆస్ట్రేలియా వికెట్లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటాయి. బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులను సంధించవచ్చో.. అదేసమయంలో బ్యాటర్లూ కూడా పరుగులు రాబట్టొచ్చు. టీ20 ప్రపంచకప్‌ 2022లో రసవత్తర పోరుకు ఖాయంగా ఉంటాయి. బంతి, బ్యాట్ మధ్య మంచి పోరు సాగనుంది' అని డేల్ స్టెయిన్‌ చెప్పారు. సూర్య అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆసియా కప్‌ 2022 సహా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారించాడు. ఇదే ఫామ్ పొట్టి టోర్నీలో కొనసాగించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. 


Also Read: విజ్డెన్ భారత్ ఆల్‌టైమ్ టీ20 టీమ్.. ఎంఎస్ ధోనీకి దక్కని చోటు! కీపర్‌ ఎవరంటే


Also Read: Neha Malik Hot Pics: నేహా మాలిక్ హాట్ ట్రీట్.. మోడ్రన్ డ్రెస్సులో పిచ్చేక్కిస్తోందిగా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook